Great Khali | రెండోసారి తండ్రైన గ్రేట్ ఖలీ.. వెల్లువెత్తుతున్న అభినందనలు
Great Khali : లెజెండరీ రెజ్లర్, మాజీ హెవీవెయిట్ చాంపియన్ గ్రేట్ ఖలీ(Great Khali) రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య హర్మిందర్ కౌర్(Harminder Kaur) శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను ఖలీ...
Great Khali : లెజెండరీ రెజ్లర్, మాజీ హెవీవెయిట్ చాంపియన్ గ్రేట్ ఖలీ(Great Khali) రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య హర్మిందర్ కౌర్(Harminder Kaur) శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను ఖలీ ఫేస్బుక్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘మీ అందరి ఆశీర్వాదాలతో మాకు కొడుకు పుట్టాడు’ అని 51 ఏండ్ల ఖలీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు, అథ్లెట్లు, ఫ్యాన్స్ ఖలీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఖలీకి, హర్మిందర్కు 2002లో వివాహం జరిగింది. ఈ దంపతులు 2014లో మొదటిసారి తల్లిదండ్రులయ్యారు. సరిగ్గా తమ 12వ మ్యారేజ్ యానివర్సరీకి ఒక రోజు మందు పుట్టిన ఆడపిల్లకు అవ్లీన్ రానా అని పేరు పెట్టారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప అథ్లెట్లలో ఖలీ ఒకడు. అతడి అసలు పేరు దిలీప్ సింగ్ రానా. 2000 సంవత్సరంలో ఖలీ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టాడు. రింగ్‌లోకి దిగడమే ఆలస్యం తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులతో చెడుగుడు ఆడడం అతడి నైజం. 2007లో తొలిసారి వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌గా అవతరించాడు.
దాంతో, డబ్ల్యూడబ్ల్యూఈ నిర్వాహకులు 2021లోఅతడి పేరును హాల్ ఆఫ్ ఫేమ్లోచేర్చి గౌరవించారు. ఆ తర్వాత పలు వేదికలపై గెలుపొందిన ఖలీ 2018లో రిటైర్మెంట్ పలికాడు. అయితే.. ఆ తర్వాత పలు ప్రకటనలు, షోల కోసం ఖలీ మళ్లీ ఫైటర్‌గా కనిపించాడు. చివరిసారిగా సెప్టెంబర్ 8న హైదరాబాద్‌లో జరిగిన సూపర్ స్టార్ స్పెక్టకిల్ షోలో ఖలీ బరిలోకి దిగాడు.
ఇవి కూడా చదవండి
-
ANIMAL- Arjan Vailly | ‘యానిమల్’ మోస్ట్ అవైటెడ్ ‘అర్జన్ వాయ్లీ’ సాంగ్ రిలీజ్
-
Yuvraj Singh: సచిన్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయాలి : యువరాజ్ సింగ్
-
KTR | ధరణి ముద్దు.. పట్వారీ వ్యవస్థ వద్దు.. ఆలోచించి ఓటేయండి : మంత్రి కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

