Rafael Nadal | ఇదే ఆఖరని చెప్పలేను.. వీడ్కోలుపై నాదల్ షాకింగ్ కామెంట్స్
Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafael Nadal) తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించాడు. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్(French Open 2024) టోర్నీకి సిద్దమైతున్న నాదల్ ఇదే తన ఆఖరి టోర్నీ కాదని చెప్పాడు.
Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafael Nadal) తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించాడు. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్(French Open 2024) టోర్నీకి సిద్దమైతున్న నాదల్ ఇదే తన ఆఖరి టోర్నీ కాదని చెప్పాడు. ‘రిటైర్మెంట్ పలుకుతానని వంద శాతం కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే.. నేను టెన్నిస్ ఆడడాన్నిఇంకా ఆస్వాదిస్తున్నా. ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా సరే ఏ హద్దులు లేకుండా టెన్నిస్ ఆడుతా. మరొక నెల లేదా నెలన్నర రోజులకు నేను ఆటకు వీడ్కోలు పలకొచ్చు’ అని నాదల్ తెలిపాడు.
సుదీర్ఘ కెరీర్లో నాదల్ ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ వంటి దిగ్గజాలను ఓడించి 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం రఫా కెరీర్లో చివరి దశకు చేరుకున్నాడు. నిరుడు తొడకండరాల గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన ఈ స్పెయిన్ బుల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో ఎంట్రీ ఇచ్చాడు.

అంతలోనే మళ్లీ గాయం తిరగబెట్టడంతో స్వదేశంలో చికిత్స తీసుకున్నాడు. ఈ మధ్యే పూర్తి స్థాయిలో కోలుకున్న నాదల్ తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇరగదీయాలనే పట్టుదలతో ఉన్నాడు. మట్టి కోర్టు మహారాజుగా పేరొందిన అతడు రికార్డు స్థాయిలో ఇక్కడ 14 టైటిళ్లు గెలుపొందాడు. అయితే.. ఈసారి కోర్టులో నాదల్ మునపటి దూకుడు కనబరుస్తాడా? అనేది టోర్నీ మొదలైతే కానీ చెప్పలేం. మే 26వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్ షురూ కానుంది. రెండువారాల పాటు సాగే ఈ టోర్నీ జూన్ 9న ముగియనుంది.
ఇవి కూడా చదవండి
- Shaheen Afridi | నాకు వైస్ కెప్టెన్సీ వద్దు.. మరొకరిని చూసుకోండి
- Lok Sabha Elections | ఆరో దశలో 59 శాతం పోలింగ్.. బెంగాల్లో అత్యధికంగా 78 శాతం
- Cyclone Remal | రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. కోల్‌కతా పోర్ట్ మూసివేత..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

