Shaheen Afridi | నాకు వైస్ కెప్టెన్సీ వద్దు.. మరొకరిని చూసుకోండి
Shaheen Afridi : టీ20 వరల్డ్ కప్ ముందే పాకిస్థాన్ జట్టుకు పెద్ద ఝలక్. ఆ జట్టు మాజీ సారథి షాహీన్ షా ఆఫ్రిది(Shaheen Afridi) వైస్ కెప్టెన్సీని తోసిపుచ్చాడు. వరల్డ్ కప్‌లో తాను బాబర్ ఆజామ్(Babar Azam)కు డిప్యూటీగా ఉండనని సెలెక్టర్లకు తేల్చి చెప్పాడు.
Shaheen Afridi : టీ20 వరల్డ్ కప్ ముందే పాకిస్థాన్ జట్టుకు పెద్ద ఝలక్. ఆ జట్టు మాజీ సారథి షాహీన్ షా ఆఫ్రిది(Shaheen Afridi) వైస్ కెప్టెన్సీని తోసిపుచ్చాడు. వరల్డ్ కప్‌లో తాను కెప్టెన్ బాబర్ ఆజామ్(Babar Azam)కు డిప్యూటీగా ఉండనని సెలెక్టర్లకు తేల్చి చెప్పాడు. దాంతో, ఆఖరి నిమిషంలో ఇదేం ట్విస్ట్ అంటూ పీసీబీ పెద్దలు తలలు పట్టుకున్నారు. త్వరలోనే వైస్ కెప్టెన్ ఎవరనేది వెల్లడించనున్నారు.
భారత గడ్డపై నిరుడు జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో పాక్ జట్టు ఘోరంగా నిరాశపరిచింది. బాబర్ సారథ్యంలోని పాక్ సెమీస్ ముంగిట వెనుదిరిగింది. దాంతో, పీసీబీ పెద్దలు బాబర్‌తో సహా కోచింగ్ సిబ్బందిపై వేటు వేశారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కొత్త సారథిగా షాహీన్ అఫ్రిది పేరును ప్రకటించారు.

అయితే.. ఆ సిరీస్‌లో పాక్ చిత్తుగా ఓడింది. అందుకని పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొన్న సెలెక్టర్లు మళ్లీ బాబర్‌కే పగ్గాలు అప్పగించారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆఫ్రిది అప్పటినుంచి గుర్రుగా ఉన్నాడు. ఒక్క సిరీస్‌కే తనను కెప్టెన్‌గా తప్పించడంపై ఆగ్రహంగా ఉన్న ఆఫ్రిది ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Our fans unveil Pakistan’s squad for the ICC Men’s #T20WorldCup 2024 in the West Indies & USA 🇵🇰🤩
Let’s go, team! 🙌#WeHaveWeWill | #BackTheBoysInGreen pic.twitter.com/7nsJwPtyn0
— Pakistan Cricket (@TheRealPCB) May 24, 2024
పొట్టి ప్రపంచ కప్ కోసం పాక్ బోర్డు శుక్రవారమే (మే 24న) తుది స్క్వాడ్‌ను ప్రకటించింది. వీడ్కోలు అనంతరం యూ టర్న్ తీసుకున్న పేసర్ మహ్మద్ అమిర్, పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League)లో ఇరగదీసిన ఇమాద్ వసీంలు జట్టులోకి వచ్చారు. కుర్రాళ్లు అబ్రార్ అహ్మద్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, సయీం అయుబ్, ఉస్మాన్ ఖాన్, అజాం ఖాన్(Azam Khan)లు తొలిసారి వరల్డ్ కప్ ఆడనున్నారు.
పాకిస్థాన్ స్క్వాడ్ : బాబర్ ఆజాం(కెప్టెన్), అబ్రర్ అహ్మద్, అజాం ఖాన్, ఫఖర్ జమాన్, హ్యారిస్ రవుఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమిర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీం అయుబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.
ఇవి కూడా చదవండి
- Fire Accident | గేమింగ్ జోన్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా 22 మంది సజీవదహనం
- Kia – EV3 | కియా నుంచి నాలుగో ఎలక్ట్రిక్ కారు.. భారత్‌లోకి వచ్చే ఏడాదే ‘ఈవీ3’ ఎంట్రీ..!
- Kamareddy | కామారెడ్డి డీఎంహెచ్‌వోపై సస్పెన్షన్ వేటు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

