Kia – EV3 | కియా నుంచి నాలుగో ఎలక్ట్రిక్ కారు.. భారత్‌లోకి వచ్చే ఏడాదే ‘ఈవీ3’ ఎంట్రీ..!
Kia - EV3 | దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా మోటార్స్ తాజాగా న్యూ కంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈవీ3 (EV3)’ కారును ఆవిష్కరించింది.
Kia – EV3 | దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా మోటార్స్ తాజాగా న్యూ కంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈవీ3 (EV3)’ కారును ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ ఈవీ9 (EV9), ఈవీ6 (EV6), ఈవీ5 (EV5) ఆవిష్కరించిన కియా నుంచి వస్తున్న నాలుగో ఈవీ కారు ‘ఈవీ3 (EV3). కియా ఈవీ3 (Kia EV3) కారు స్టాండర్డ్ వర్షన్ 58.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, లాంగ్ రేంజ్ ఎడిషన్ (డబ్ల్యూఎల్టీపీ సైకిల్ పై 600 కి.మీ వరకూ) 81.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తున్నది’ అని కియా తెలిపింది. రెండు మోటార్లూ 201 హెచ్‌పీ విద్యుత్, 283 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. 7.5 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఈ కారు సొంతం. ఈవీ3 కారు గరిష్టంగా గంటకు 170 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
తొలుత గ్లోబల్ మార్కెట్లలో ఈవీ3 కారును ఆవిష్కరించిన తర్వాత భారత్ మార్కెట్లో వచ్చే ఏడాది (2025)లో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. ‘ఈ-జీఎంపీ మాడ్యులర్ ప్లాట్ ఫామ్’ పై ఈవీ 3 కారు నిర్మితమైంది. కియా బ్రాండ్ స్టార్ మ్యాప్ సిగ్నేచర్ కాన్సెప్ట్, వెర్టికల్‌గా రూపొందించిన డేటైం రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్స్)తోపాటు టైగర్ ఫేస్ డిజైన్ తో వస్తున్నదీ కియా ఈవీ3.
కియా ఈవీ3 కారు తొమ్మిది కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. వాటిలో కొత్తగా అవెంచరైన్ గ్రీన్, టెర్రాకొట్టా కలర్స్ ఉంటాయి. ఈవీ9 తరహా స్టైలిష్ డిజైన్‌ను ప్రతిబింబిస్తూ ఉంటుంది. డాష్ బోర్డ్, ట్విన్ 12.3 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్స్, డిస్క్రేట్లీ ఇంటిగ్రేటెడ్ ఏసీ వెంట్స్, హాప్టిక్ బటన్స్ స్ట్రిప్, నేవిగేషన్ అండ్ మీడియా కంట్రోల్స్, 30-అంగుళాల వైడ్ స్క్రీన్ సెటప్, డెడికేటెడ్ 5-అంగుళాల స్క్రీన్ ఫర్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు జత చేశారు.
స్ట్రాంగ్ డ్యుయల్ టోన్ బంపర్, స్మూత్ సర్ ఫేసింగ్ ఆన్ టెయిల్ గేట్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇంకా జీటీ లైన్ వర్షన్లలో మరింత స్పోర్టీ బంపర్లు జత చేశారు. కప్ హోల్డర్లతోపాటు రూమీ ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, ప్రయాణికుల సౌలభ్యం కోసం ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, రిలాక్సేషన్ మోడ్ కోసం డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్, ప్రయాణికులు ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ తో ఫేవరెట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, వీడియో గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఈవీ3 12 అంగుళాల హెడ్ అప్ డిస్ ప్లే, కస్టమైజబుల్ ఆంబియెంట్ లైటింగ్, అడ్వాన్స్డ్ డిజిటల్ డిస్ ప్లేలు, ప్రీమియం హార్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, సేఫ్టీ కోసం అడాస్ సూట్, పర్సనల్ ఏఐ అసిస్టెంట్ తదితర ఫీచర్లు కూడా ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- EV3
- Kia Motors
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

