ICC | వరల్డ్ కప్‌లో రికార్డుల వీరుడికి ఐసీసీ అవార్డు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ గెలుచుకున్న కివీస్ చిచ్చరపిడుగు
ICC Player Of The Month : న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) ప్రతిష్ఠాత్మక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అక్టోబర్ నెలకుగానూ అతడు ఈ అవార్డు అందుకున్నాడు. ఆరంగేట్రం వరల్డ్ కప్‌లో రికార్డులు...
ICC Player Of The Month : న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) ప్రతిష్ఠాత్మక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అక్టోబర్ నెలకుగానూ అతడు ఈ అవార్డు అందుకున్నాడు. ఆరంగేట్రం వరల్డ్ కప్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ఈ యంగ్‌స్టర్ నామినేట్ అయిన మొదటిసారే విజేతగా నిలవడం విశేషం.
ఐసీసీ నిర్వహించిన పోలింగ్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock)కంటే ఎక్కువ ఓట్లతో ఈ కివీ బ్యాటర్ అవార్డును ఎగరేసుకుపోయాడు. ‘ఐసీసీ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు జట్టుకు ఈ నెల చాలా ప్రత్యేకం. భారత్‌లో వరల్డ్ కప్ ఆడడం మరింత ప్రత్యేకం’ అని రవీంద్ర అన్నాడు. ఇక మహిళల విభాగంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాధ్యూస్(Hayley Matthews) విజేతగా నిలిచింది. దాంతో, ఈ అవార్డు కోసం పోటీపడిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కేర్, బంగ్లాదేశ్ స్పిన్నర్ నహిదా అక్తర్‌లకు నిరాశే మిగిలింది.

ప్రపంచ కప్‌లో వీర విహారం చేస్తున్న కివీ ఓపెనర్ రచిన్ రవీంద్ర రికార్డులు తిరగరాస్తున్నాడు. మేటి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ.. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డులను బద్ధలు కొడుతున్నాడు. ఈ మెగా టోర్నీ మొదలైన అక్టోబర్ నెలలో రచిన్ ఏకంగా 406 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ 9 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలతో కలిపి 565 పరుగులు కొట్టాడు.

అంతేకాదు ప్రపంచ కప్‌లో 5 సార్లు 50ప్లస్ స్కోర్ చేసిన మూడో కివీ బ్యాటర్‌గా రచిన్ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. గురువారం శ్రీలంకపై అద్భుత విజయంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్తుకు మరింత చేరువైంది. రన్‌రేటులో పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉండడంతో కేన్ విలియమ్సన్ సేనకే నాలుగో బెర్తు దక్కే చాన్స్ ఉంది. అదే జరిగితే.. నవంబర్ 15న తొలి సెమీఫైనల్లో భారత్, బ్లాక్‌క్యాప్స్ తలపడనున్నాయి. ఇక టీమిండియాకు 2019 ఎడిషన్ సెమీఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకొనే సమయం రానే వచ్చింది.
ఇవి కూడా చదవండి
-
Liverpool Footballer | లివర్‌పూల్ ఫుట్‌బాలర్ తండ్రిని విడిచిపెట్టిన కిడ్నాపర్లు
-
Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!
-
Koppula Eshwar | ప్రజాక్షేత్రమే ఆయన ఇల్లు. సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

