Liverpool Footballer : లివర్‌పూల్ ఫార్వర్డ్ లూయిస్ డియాజ్(Luis Diaz) తల్లిదండ్రుల కిడ్నాప్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగైదు రోజుల క్రితమే అతడి తల్లిని విడిచిపెట్టిన కిడ్నాపర్లు తాజాగా తండ్రిని కూడా విడుదల చేశారు. ప్రభుత్వం చర్చలు జరపడంతో.. కొలంబియా నేషనల్ లిబరేషన్ ఆర్మీ(ఈఎల్ఎన్) గెరిల్లా దళ సభ్యులు గురువారం డియాజ్ తండ్రి లూయిస్ మాన్యుయేల్(Luis Manuel Diaz)కు విముక్తి కల్పించారు.
కొలంబియాలో 60 ఏండ్ల అంతర్గత సంక్షోభానికి తెరదించాలని ఈఎల్ఎన్తో నిరుడు ప్రభుత్వం శాంతి చర్చలను పునరుద్దరించింది. అయితే.. మాన్యూయేల్ కిడ్నాప్‌తో ఈ చర్చలకు విఘాతం కలిగింది. కొలంబియా సంక్షోభం ఇప్పటివరకూ 4 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది.
రెండు వారాల తర్వాత విడుదలైన డియాజ్ తండ్రి
ప్రీమియర్ లీగ్(Premier League 2023)లో ఆడుతున్న లూయిస్ ఆదివారం ల్యూటన్ క్లబ్(Luton Town) జరిగిన మ్యాచ్‌లో తన తండ్రిని విడుదల చేయాలని కిడ్నాపర్లను ప్రాధేయపడ్డాడు. మ్యాచ్‌లో గోల్ కొట్టిన అనంతరం టీ షర్ట్‌పై రాసున్న ‘ఫ్రీడమ్ ఫర్ డాడ్’ అక్షరాలు కనిపించేలా తన జెర్సీని నోటకరచుకున్నాడు. ఆ కాసేపటికే కొలంబియా గొరిల్లా(colombian guerilla movement) దళ సభ్యులు అతడి తండ్రిని విడుదల చేస్తామని ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.