Quinton de Kock | శతకాల మోత మోగిస్తున్న డికాక్.. బంగ్లా పైనా సెంచరీ..
Quinton de Kock | 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇదివరకే రెండు సెంచరీలు చేసిన డికాక్.. తాజాగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా శతకంతో చెలరేగాడు.
Quinton de Kock | తన వన్డే కెరీర్‌కు ఘనమైన ముగింపునిచ్చేందుకు భారత్‌కు వచ్చిన క్వింటన్ డికాక్.. వన్డే వరల్డ్ కప్‌లో శతకాల మోత మోగిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇదివరకే రెండు సెంచరీలు చేసిన డికాక్.. తాజాగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా శతకంతో చెలరేగాడు. గత ఐదు ఇన్నింగ్స్‌లలో డికాక్‌కు ఇది మూడో శతకం కావడం గమనార్హం. శ్రీలంక, ఆస్ట్రేలియాతో పాటు బంగ్లా బౌలర్లపైనా డికాక్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించాడు. డికాక్ వీరవిహారంతో 40 ఓవర్లకు సౌతాఫ్రికా.. మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.
ఈ వన్డే ప్రపంచకప్‌కు ముందే డికాక్ తన రిటైర్మెంట్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే మెగా టోర్నీ తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని డికాక్ ఇదివరకే చెప్పాడు. పోతూ పోతూ ఈ సఫారీ వికెట్ కీపర్ శతకాల మోతెక్కిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌కు ముందు 2022 జనవరిలో భారత్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన డికాక్ ఆ తర్వాత సుమారు 15 ఇన్నింగ్స్ ఆడినా మూడంకెల స్కోరు దరిదాపుల్లోకి కూడా రాలేదు. కానీ ఈనెల 7న శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ (100) చేసిన క్వింటన్.. తదుపరి మ్యాచ్‌లో ఆసీస్‌పైనా 109 పరుగులు చేసి ఆ జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌ల మీద విఫలమైనా డికాక్ తాజాగా బంగ్లాదేశ్‌తో శతకం పూర్తిచేశాడు.
డికాక్‌కు తన కెరీర్లో ఇది మూడో వన్డే వరల్డ్ కప్. 2015, 2019లలో అతడు ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. కానీ ఈసారి మాత్రం ఐదు మ్యాచ్‌లలోనే ఏకంగా మూడు శతకాలు బాదడం విశేషం. తద్వారా డికాక్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్.. ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (5) అగ్రస్థానంలో ఉండగా తర్వాత కుమార సంగక్కర (4), మార్క్ వా, సౌరవ్ గంగూలీ, మాథ్యూ హెడెన్, డేవిడ్ వార్నర్ (3) లు తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఇక వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎబి డివిలియర్స్ (4) తర్వాత స్థానం డికాక్‌దే కావడం గమనార్హం. ఈ క్రమంలో డికాక్.. గిబ్స్, హషీమ్ ఆమ్లా, ఫాఫ్ డుప్లెసిస్ (2)లను అధిగమించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

