PV Sindhu | ‘ఎవరితోనైనా డేటింగ్ చేశారా’?.. సింధు సమాధానం తెలిస్తే షాకవుతారు..!
PV Sindhu : భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ విజేత పీవీ సింధు(PV Sindhu) ఈ ఏడాది టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఈ సీజన్లో పలు టోర్నీల్లో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన సింధు వచ్చే ఏడాది ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్(Paris Olympics)లో పతకంపై గురిపెట్టింది. అందకని బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొనే...
PV Sindhu : భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ విజేత పీవీ సింధు(PV Sindhu) ఈ ఏడాది టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఈ సీజన్లో పలు టోర్నీల్లో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన సింధు వచ్చే ఏడాది ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్(Paris Olympics)లో పతకంపై గురిపెట్టింది. అందకని బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొనే (Prakash Padukone)ను మెంటార్‌గా నియమించుకున్న ఈ తెలుగుతేజం.. గత కొన్ని రోజులుగా కోర్టులో చెమటోడ్చుతుంది. అయితే.. ఈమధ్య ఒక పోడ్కాస్ట్లో సింధుకు ఊహించని ప్రశ్న ఎదురైంది.
వ్యక్తిగత విషయాల్ని చాలా గోప్యంగా ఉండేలా చూసుకొనే ఆమెను ఎవరితోనైనా డేటింగ్ చేశారా? అని అడిగారు. అందుకు సింధు తాను సింగిల్‌గానే ఉన్నానని బదులిచ్చింది. సింధు పోడ్కాస్ట్లో మాట్లాడిన వీడియో టీఆర్ఎస్ క్లిప్స్(TRS Clips) అనే యూట్యూబ్ ఛానెల్లో పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో డేటింగ్ చేశారా? అనే ప్రశ్నకు సింధు.. ‘లేదు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. డేటింగ్ చేయడంలో తప్పేమీ లేదు. ఒకవేళ ఆ టైమ్ వస్తే అది జరుగుతుంది. ఇప్పటికైతే నేను సింగిల్‌గానే ఉన్నాన’ని చెప్పింది.
రిలేషన్‌షిప్‌పై సింధు మాట్లాడిన వీడియో
‘ప్రస్తుతానికి నా ఫోకసంతా బ్యాడ్మింటన్ మీదే. ఒలింపిక్స్‌లో పతకం గెలవడమే నా అంతిమ లక్ష్యం’ అని ఆమె చెప్పుకొచ్చింది. మీకు భాగస్వామి కావాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సింధు.. ‘ఆ విషయం గురించి నేను అసలు ఆలోచించడం లేదు. అయితే.. నాకు పార్ట్నర్ కావాలి. కానీ, విధి ఏం నిర్ణయించిందో. నుదిటి మీద ఏం రాసుంటే అదే జరుగుతుంది’ అంటూ తెలివిగా సమాధానం చెప్పింది.

కామన్వెల్త్ క్రీడల అనంతరం గాయం కారణంగా సింధు దాదాపు 5 నెలల పాటు ఆటకి దూరమైంది. కోలుకుని బరిలోకి దిగిన ఆమె మునుపటి జోరు కనబర్చలేకపోతోంది. ఈ సీజన్లో మ్యాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్(Madrid Spain Masters) ఫైనల్‌కు చేరడమే సింధు అత్యుత్తమ ప్రదర్శన. ఆతర్వాత ఆడిన అన్ని టోర్నీల్లోనూ సెమీస్ అడ్డంకిని దాట లేకపోయింది. యూఎస్ ఓపెన్, కెనడా ఓపెన్లలో సింధు క్వార్టర్ ఫైనల్లో ఓడింది.
ఇవి కూడా చదవండి
-
ISRO | ఇస్రో మరో ఘనత.. చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్
-
Dunki Trailer | డంకీ ట్రైలర్ వచ్చేసింది.. షారుక్‌ఖాన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమేనా!
-
Khalistani Terrorist | పాక్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది రోడే మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

