ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న cZC పీవీ సింధు.. తాజా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు కోల్పోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలువలేకపోయిన 27 ఏండ్ల సింధు.. 60,448 పాయింట్లతో 11వ ర్యాంక్‌కు పరిమితమైంది. 2016 నవంబర్ నుంచి నిలకడగా టాప్-10లో కొనసాగుతూ వస్తున్న సింధు.. మొదటి సారి కిందికి పడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 8వ స్థానంలో నిలువగా.. కిడాంబి శ్రీకాంత్ 21వ, లక్ష్యసేన్ 25వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఇటీవల స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 6వ స్థానాన్ని దక్కించుకుంది.