IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ముల్లనూర్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో కోల్‌కతా స్టార్ పేసర్ అన్రిజ్ నొర్జి(Anrich Nortje) ఎంట్రీ ఇస్తున్నాడు.
గత మ్యాచ్‌లో 245 రన్స్ కొట్టినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబద్ చేతిలో ఓడిపోయిన పంబాబ్ మళ్లీ గెలుపు బాటపట్టాలనే కసితో ఉంది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీ తేడాతో గెలుపొందిన కోల్‌కతా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. దాంతో, ఇరుజట్ల మధ్య తగ్గపోరు అభిమానులను అలరించడం ఖాయం.
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నేహల్ వధేర, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కో యాన్సెస్, గ్జావియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
🚨 Toss 🚨@PunjabKingsIPL won the toss and opted to bat first against @KKRiders.
Updates ▶️ https://t.co/sZtJIQpcbx#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/ZkwM17fknM
— IndianPremierLeague (@IPL) April 15, 2025
కోల్‌కతా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, అన్రిజ్ నోర్జ్. వరుణ్ చక్రవర్తి.