PSL 2025 | పాకిస్తాన్ సూపర్ లీగ్.. క్రికెటర్లు బస చేసిన హోటల్లో అగ్ని ప్రమాదం..!
PSL 2025 | పాకిస్తాన్ సూపర్ లీగ్ శుక్రవారం మొదలైంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు ఇస్లామాబాద్‌లోని హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పీఎస్ఎల్ జట్టు క్రికెటర్లతో పాటు సిబ్బంది ఈ హోటల్లోనే బస చేశారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లోని ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.
PSL 2025 | పాకిస్తాన్ సూపర్ లీగ్ శుక్రవారం మొదలైంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు ఇస్లామాబాద్‌లోని హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పీఎస్ఎల్ జట్టు క్రికెటర్లతో పాటు సిబ్బంది ఈ హోటల్లోనే బస చేశారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లోని ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. పీఎస్ఎల్ క్రికెటర్లు, సిబ్బందిని రక్షించారు. మంటల్లో ఎవరూ గాయపడలేదని.. వారిని అక్కడి నుండి మరో చోటుకి తరలించినట్లు పేర్కొన్నారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సీఎస్ఎల్ సీఈవో సల్మాన్ నసీర్ మీడియాతో మాట్లాడుతూ మంటలు హోటల్లోకి ప్రవేశించలేదన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఆరు ఫైర్ ఇంజిన్లు, 50 మంది సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అరగంటలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు సీడీఏ అత్యవసర డైరెక్టర్ జాఫర్ ఇక్బాల్ పేర్కొన్నారు.
పీఎస్ఎల్ 2025 తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్.. లాహోర్ ఖలందర్స్‌తో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తలపడింది. ఐపీఎల్ నేపథ్యంలో పీఎస్ఎల్ తొలి మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించింది. ఐపీఎల్ నేపథ్యంలో రాత్రి 8 గంటలకు పీఎస్ఎల్ మ్యాచులు మొదలవుతాయని పీఎస్ఎల్ సీఈవో సల్మాన్ నసీర్ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఐపీఎల్, పీఎస్ఎల్ లీగ్‌లు మొదలైనప్పటి నుంచి.. ఒకే విండోలో తలపడడం ఇదే తొలిసారి. బిజీ క్యాలెండర్ నేపథ్యంలో ఏప్రిల్-మే విండోలో పీఎస్‌ఎల్‌ని షెడ్యూల్ చేయడం తప్ప మరో మార్గం లేదని నసీర్ పేర్కొన్నారు. ఇది మంచిది కాదని.. అయితే, పీఎస్ఎల్ అభిమానులను ఆకర్షిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఐపీఎల్, పీఎస్ఎల్ ఒకేసమయంలో కొనసాగుతుండడం వల్ల ప్రయోజనం ఏంటంటే.. ఐపీఎల్ వేలంలో అమ్ముడవకుండా మిగిలిపోయిన కొందరు విదేశీ స్టార్స్ పీఎస్ఎల్ ఆడేందుకు ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏడాది లీగ్‌లోకి మరో రెండు జట్ల చేర్చాలని భావిస్తున్నట్లు పీఎస్ఎల్ సీఈవో పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

