PSL 2024 | అంతర్జాతీయంగా పలు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతున్నా వాటికి సమాంతరంగా టీ20 లీగ్‌ల సీజన్ కూడా ఊపందుకుంది. ఇదివరకే దక్షిణాఫ్రికా వేదికగా ఎస్ఎ20 (SA 20) ముగియగా యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (IL T20)లో ఫైనల్ మ్యాచ్ మాత్రమే బాకీ ఉంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో సగం సీజన్ పూర్తైంది. ఇక రేపటి (ఫిబ్రవరి 17) నుంచి పాకిస్తాన్ వేదికగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ ఖలాండర్స్.. ఇస్లామాబాద్ యూనైటెడ్ ల మధ్య లాహోర్ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనుంది. 9వ సీజన్‌గా మొదలుకాబోతున్న ఈ మెగా టోర్నీలో ఎన్ని మ్యాచ్‌లు జరుగుతాయి..? ఎన్ని టీమ్స్ ఆడబోతున్నాయి..? కెప్టెన్లు ఎవరు..? భారత్‌లో లైవ్ చూడటం ఎలా..? వంటి ఆసక్తికర విషయాలు మీకోసం..
నాలుగు వేదికలు.. ఆరు జట్లు.. 34 మ్యాచ్‌లు..
ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకూ జరుగబోయే ఈ టోర్నీలో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆరుజట్లు (ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలాండర్స్, ఇస్లామాబాద్ యూనైటెడ్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్) పీఎస్ఎల్ – 9 ట్రోఫీ కోసం తలపడబోతున్నాయి. డబుల్ రౌండ్ రాబిన్ విధానంలో జరుగబోయే ఈ మ్యాచ్‌లలో ఒక్కో జట్టు మిగిలిన ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. 30 లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్లేఆఫ్స్ (క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఎలమినేటర్ 2, ఫైనల్) విధానంలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లు అన్నీ లాహోర్, కరాచీ, ముల్తాన్, రావల్పిండి వేదికలుగా జరుగుతాయి. ప్లేఆఫ్స్‌లోని మూడు మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు కరాచీలోని నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
It’s here! 🤩
The #HBLPSL9 Orion Trophy is unveiled at Polo Ground, Jillani Park 🏆✨
More details ➡️ https://t.co/3XF8Lq39hi#KhulKeKhel pic.twitter.com/CZJEnBR7Cp
— PakistanSuperLeague (@thePSLt20) February 13, 2024
కెప్టెన్లు..
1. ఇస్లామాబాద్ యునైటెడ్ – షాదాబ్ ఖాన్
2. పెషావర్ జల్మీ – బాబర్ ఆజమ్
3. క్వెట్టా గ్లాడియేటర్స్ – రిలీ రూసో
4. ముల్తాన్ సుల్తాన్స్ – మహ్మద్ రిజ్వాన్
5. కరాచీ కింగ్స్ – షాన్ మసూద్
6. లాహోర్ ఖలాండర్స్ – షహీన్ షా అఫ్రిది
భారత్‌లో ఇలా చూడండి..
HBL PSL 9 going WORLDWIDE!🌍
Catch all the action on our global broadcast partners.
In association with @_TransGroup (#HBLPSL Global Media Rights Partners)#HBLPSL9 #KhulKeKhel 🏏 pic.twitter.com/uihzr05Csl
— PakistanSuperLeague (@thePSLt20) February 16, 2024
పాకిస్తాన్లో జరుగబోయే ఈ టోర్నీని భారత్‌లో టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం లేదు. కానీ ఫ్యాన్‌కోడ్ (Fancode) యాప్ ద్వారా మాత్రం ఈ మ్యాచ్‌లను లైవ్ వీక్షించొచ్చు. ఫ్యాన్‌కోడ్ యాప్‌తో పాటు వెబ్‌సైట్స్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారాలను చూడొచ్చు. అయితే ఇది ఫ్రీగా అయితే అందుబాటులో లేదు. ఒక్క మ్యాచ్ చూడాలంటే రూ. 25 చెల్లించాల్సిందే. మొత్తం మ్యాచ్‌లు చూసేందుకు టూర్ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూ. 149 చెల్లిస్తే పీఎస్ఎల్ 9 మ్యాచ్‌లను లైవ్ చూడొచ్చు.