Kylian Mbappe | ఎంబాపే మా క్లబ్‌ను వీడడం లేదు.. ధ్రువీకరించిన పీఎస్జీ
Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) కొత్త క్లబ్‌కు మారనున్నాడనే వార్తలకు తెరపడింది. అతను తమ క్లబ్తోనే కొనసాగుతాడంటూ తాజాగా పారిస్ సెయింట్ జర్మనీ(PSG) క్లబ్ ధ్రువీకరించింది. అంతేకాదు ఎంబాపేను తొలి ప్రాధాన్య జట్టులోకి తీసుకున్నామని తెలిపింది. 'లోరియెంట్(Lorient)తో మ్యాచ్‌కు ముందు...
Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) కొత్త క్లబ్‌కు మారనున్నాడనే వార్తలకు తెరపడింది. అతను తమ క్లబ్తోనే కొనసాగుతాడంటూ తాజాగా పారిస్ సెయింట్ జర్మనీ(PSG) క్లబ్ ధ్రువీకరించింది. అంతేకాదు ఎంబాపేను తొలి ప్రాధాన్య జట్టులోకి తీసుకున్నామని తెలిపింది. ‘లోరియెంట్(Lorient)తో మ్యాచ్‌కు ముందు పీఎస్జీ యాజమాన్యం, ఎంబాపే మధ్య జరిగిన సుదీర్ఘ చర్యలు సఫలం అయ్యాయి. ఈరోజు ఉదయం అతడికి మా ఫస్ట్ టీమ్ స్క్వాడ్‌లోకి తీసుకున్నాం’ అని పీఎస్జీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సీజన్ ఆరంభం నుంచి పీఎస్జీ యాజమాన్యం, ఎంబాపే మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో క్లబ్ తొలి ప్రాధాన్య జట్టు సభ్యులతో విడిగా ఉంటూ వేరుగా సాధన చేస్తున్నాడు. సమస్యను మరింత పెద్దది చేయొద్దనే ఉద్దేశంతో క్లబ్ పెద్దలు, అతడితో సమావేశమయ్యారు. అయితే.. ఈ వరల్డ్ కప్ హీరోను రియల్ మాడ్రిడ్(Real Madrid) క్లబ్‌కు అప్పగిస్తారనే వార్తలు వినిపించాయి. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(All Hilal) క్లబ్ ఎంబాపే కోసం ఏకంగా రూ. 400 కోట్ల ఆఫర్ ప్రకటించింది. కానీ, అతను ఓకే చెప్పలేదు.
గోల్డెన్ బూట్ అవార్డుతో ఎంబాపే

నిరుడు ఖతర్‌లో జరిగిన వరల్డ్ కప్(FIFA World Cup 2022)లో ఎంబాపే అదరగొట్టాడు. ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్(Hat-trick Goals) కొట్టి అర్జెంటీనా(Arjentina)ను వణికించాడు. కానీ, షూటౌట్లో 2-4తో ఫ్రాన్స్ ఓటమి పాలైంది. ఆ టోర్నీలో ఎక్కువ గోల్స్ కొట్టిన అతడికి గోల్డెన్ బూట్ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి
Virat Kohli | కోహ్లీతో సెల్ఫీ దిగలేకపోయిన అభిమాని.. విరాట్ అతడికి ఏం చెప్పాడంటే..?
Caribbean Premier League 2023 | ఓవర్ రేటు కట్టడికి కొత్త రూల్స్.. సమయం వృథా చేస్తే 5 పరుగుల పెనాల్టీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

