Prithvi Shaw | నార్తంప్టన్‌షైర్ జట్టుకు ఎదురుదెబ్బ.. మిగతా మ్యాచ్‌లకు పృథ్వీ షా దూరం..!
Prithvi Shaw : వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్(Northamptonshire) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. దంచికొడుతున్న ఓపెనర్, భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw) గాయ పడ్డాయడు. దాంతో ఈ స్టార్ బ్యాటర్ మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈరోజు డుర్హం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షా మోకాలికి...
Prithvi Shaw : వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్(Northamptonshire) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. దంచికొడుతున్న ఓపెనర్, భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw) గాయ పడ్డాయడు. దాంతో ఈ స్టార్ బ్యాటర్ మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈరోజు డుర్హం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షా మోకాలికి గాయం అయింది. మొదట్లో చిన్న గాయమే అనుకున్నారంతా. కానీ, స్కానింగ్‌లు తీశాక అనుకున్నదానికంటే గాయం తీవ్రత ఎక్కువ ఉందని తెలిసింది.
దాంతో, భారత క్రికెట్ బోర్డు వైద్య బృందానికి పృథ్వీ షా ఈ విషయం తెలియ చేశాడు. లండన్‌లో ఉన్న స్పెషలిస్ట్‌తో అతడికి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. ‘ఇది మాకు నిజంగా పెద్ద షాక్. అద్భుత ఆటతో పృథ్వీ మా క్లబ్‌పై ప్రభావం చూపాడు. ఒకవేళ అతడు మిగతా మ్యాచ్‌లకు దూరమైతే అది మాకు పెద్ద ఎదురుదెబ్బ’ అని నార్తంప్టన్‌షైర్ హెడ్‌కోచ్ జాన్ సాడ్లర్(John Sadler) ఓ ప్రకటనలో తెలిపాడు.
పృథ్వీ షా డబుల్ సెంచరీ (244)

ఐపీఎల్ 16వ సీజన్లో పేలవ ఫామ్‌తో షా విమర్శలపాలయ్యాడు. ఈ విధ్వంసక ఓపెనర్ భారీ స్కోర్లు చేయకపోవడం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాల్ని దెబ్బతీసింది. దాంతో, వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు. మళ్లీ భారత జట్టులోకి రావాలంటే మళ్లీ పరుగులు సాధించడం ఒక్కటే మార్గమని షా అనుకున్నాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న వన్డే కప్‌తో మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. సొమర్సెట్ (Somerset)పై డబుల్ సెంచరీ (244), డుర్హం జట్టు(Durham)పై సెంచరీ(125 నాటౌట్)తో చెలరేగాడు.
ఇవి కూడా చదవండి
Ishan Kishan – Sanju Samson | వరల్డ్ కప్ జట్టులో వికెట్ కీపర్ ఎవరు..? ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ..!
Rishabh Pant | మైదానంలోకి దిగిన రిషబ్.. సిక్సర్లు, ఫోన్లతో చెలరేగిన పంత్..! వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

