IND vs AUS : ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా(Australia) కష్టాల్లో పడింది. 400 పరుగుల ఛేదనలో 9 పరుగులకే ఆసీస్ రెండు కీలక వికెట్లు పడ్డాయి. ప్రసిద్ కృష్ణ(Prasidh Krishna) బౌలింగ్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్(9), స్టీవ్ స్మిత్(0) ఔటయ్యారు. అయితే.. హ్యాట్రిక్ బంతికి మార్నస్ లబూషేన్(1) ఒక పరుగు తీశాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(0) క్రీజులో ఉన్నాడు.
Two in Two for @prasidh43 🙌🙌
Matthew Short (9) and Steve Smith (0) depart in quick succession.
Live – https://t.co/XiqGsyElAr… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/yHWRX9mZsJ
— BCCI (@BCCI) September 24, 2023
మొదట ఆడిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(72 నాటౌట్) కెప్టెన్ కేఎల్ రాహుల్(52 ) దంచి కొట్టారు. దాంతో, 399 రన్స్ చేసింది. వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.