Prakash Padukone | ఒలింపిక్స్‌కు బ్యాడ్మింటన్ లెజెండ్.. ఎందుకో తెలుసా..?
Prakash Padukone : భారత బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొనే (Prakash Padukone)కు అరుదైన గౌరవం దక్కింది. విశ్వ క్రీడల్లో పాల్గొనే ఇండియా స్క్వాడ్‌కు ప్రకాశ్ మెంటార్‌గా నియమితులయ్యాడు.
Prakash Padukone : భారత బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొనే (Prakash Padukone)కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్’ గెలుపొందిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రకాశ్.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో కొత్త అవతారంలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. విశ్వ క్రీడల్లో పాల్గొనే ఇండియా స్క్వాడ్‌కు ప్రకాశ్ మెంటార్‌గా నియమితులయ్యాడు. 15 మందితో కూడిన భారత బృందానికి ఈ దిగ్గజ ఆటగాడు దిశా నిర్దేశనం చేయనున్నాడు.
‘ఏడుగురు షట్లర్లు. ఎనిమిది మంది సహాయక సిబ్బంది.. ప్రకాశ్ పదుకొనే మెంటార్‌గా, పుల్లెల గోపీచంద్, ఆర్‌ఎంవీ గురుసాయిదత్, అగస్ సాంటోసా, విమల్ కుమార్, మథియాస్ బోలు కోచ్‌లుగా ప్యారిస్ వెళ్లనున్నారు’ అని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(BAI) వర్గాలు తెలిపాయి.
కల నెరవేరకుండానే..
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రకాశ్ పదుకొనే తారాజువ్వలా దూసుకొచ్చాడు. చైనా, మలేషియా, థాయ్‌లాండ్ ఆటగాళ్ల హవా నడుస్తున్న సమయంలో భారత దేశం నుంచి విశ్వ వేదికల మీద సంచలన ఆటతో అదరగొట్టాడు. అంతేకాదు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుపొందిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అయితే.. ఒలింపిక్స్ కల నెరవేరకుండానే ప్రకాశ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 1991లో అతడు ఆటకు గుడ్ బై చెప్పేయగా.. బార్సిలోనాలో 1992లో జరిగిన విశ్వ క్రీడల్లో బ్యాడ్మింటన్‌కు ఎంట్రీ లభించింది.
𝐀 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐇𝐨𝐧𝐨𝐮𝐫 👏🇮🇳@himantabiswa | @sanjay091968 | @Arunlakhanioffi
📸: @badmintonphoto#Paris2024#IndiaontheRise#Badminton pic.twitter.com/Gsbz4RPeYO
— BAI Media (@BAI_Media) July 9, 2024
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి తెలుగు తేజం పీవీ సింధు నేతృత్వం వహించనుంది. మహిళల సింగిల్స్ నుంచి ఆమె ఒక్కరే అర్హత సాధించగా.. పురుషుల విభాగంలో ప్రణయ్, లక్ష్య సేన్లు క్వాలిఫై అయ్యారు.
భారత బృందం : పీవీ సింధు, హెచ్‌హెస్ ప్రణయ్, లక్ష్య సేన్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తనీశా క్రాస్టోలు బెర్తు సాధించారు.
ఇవి కూడా చదవండి
- Rohit Sharma | ద్రవిడ్ బాటలోనే హిట్‌మ్యాన్.. వరల్డ్ కప్ ‘బోనస్’పై కీలక నిర్ణయం
- Police notice to BJP MLA | దిశా మృతి కేసులో.. బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేకు పోలీస్ నోటీస్
- Registration | సాంకేతిక సమస్యలతో.. తెలంగాణవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

