సెయింట్ లూయిస్ (యూఎస్ఏ) : ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ (జీసీటీ)లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ర్యాపిడ్‌తో పాటు బ్లిట్జ్ గేమ్స్‌లో ప్రజ్ఞా.. 19-9తో విన్సెంట్ కీమర్ (జర్మనీ)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు.
మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫాబియానో కరువానా (యూఎస్ఏ).. 18-12తో వెస్లీ సోపై గెలిచాడు. ఫైనల్లో ప్రజ్ఞా, కరువానా తలపడనుండగా మూడో స్థానం కోసం జరిగే పోరులో కీమర్.. వెస్లీతో ఆడనున్నాడు.