సెయింట్ లూయిస్ (అమెరికా) : ప్రతిష్టాత్మక సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. గురువారం అమెరికాకు చెందిన వెస్లీ సోతో జరిగిన ఉత్కంఠభరిత అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. దీంతో కొద్దిలో టైటిల్ విజయం చేజార్చుకుని రెండో స్థానంతో టోర్నీని ముగించాడు.
అంతకుముందు చివరి,9వ క్లాసికల్ రౌండ్లో నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీష్ గిరితో జరిగిన మ్యాచ్‌ను ప్రజ్ఞా డ్రాగా ముగించాడు. చెరో 5.5 పాయింట్లతో వెస్లీ సో, ప్రజ్ఞా సమంగా నిలవడంతో విన్నర్‌ను తేల్చేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. ఇందులో రెండు ర్యాపిడ్ గేమ్స్‌లో చెరోటి నెగ్గడంతో అర్మగెడాన్ ను నిర్వహించగా.. చివరకు వెస్లీనే పైచేయి సాధించాడు.