IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్లో బౌలర్లను ఉతికారేస్తున్న పవర్ హిట్టర్లు రికార్డులు బద్ధలు కొడుతున్నారు. సెంచరీల మోత మోగిస్తున్నారు. ఈ సీజన్లో మరో సెంచరీ నమోదైంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ మరవకముందే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(103) సెంచరీతో చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విధ్వంసక బ్యాటింగ్ చేసిన అతను 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో వంద పరుగులు కొట్టాడు. దాంతో, చిన్న వయసులో శతకం బాదిన ఆరో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ జాబితాలో మనీశ్ పాండే అగ్రస్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ పదహారో సీజన్లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ సెంచరీ సాధించాడు. ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్‌ను ధనాధన్ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. దాంతో, పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 167 రన్స్ కొట్టింది. ఈ సీజన్లో హ్యారీ బ్రూక్(సన్ రైజర్స్ హైదరాబాద్), వెంకటేశ్ అయ్యర్(కోల్‌కతా నైట్ రైడర్స్), యశస్వీ జైస్వాల్(రాజస్థాన్ రాయల్స్), సూర్యకుమార్ యాదవ్(ముంబై ఇండియన్స్) సెంచరీతో సత్తా చాటారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీ కొట్టిన ప్రభ్సిమ్రాన్ సింగ్(103)
1. మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు) 2009లో శతకం బాదాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన అతను దక్కన్ చార్జర్స్‌పై సెంచరీతో కదం తొక్కాడు.
2. రిషభ్ పంత్, ఢిల్లీ క్యాపిటల్స్ (20 ఏళ్ల, 218 రోజులు) 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ కొట్టాడు.
3. దేవ్‌దత్ పడిక్కల్, ఆర్సీబీ (20 ఏళ్ల, 289 రోజులు) 2021లో రాజస్థాన్ రాయల్స్‌పై వంద పరుగులు చేశాడు.
4. యశస్వీ జైస్వాల్, రాజస్థాన్ రాయల్స్ (21 ఏళ్ల, 123 రోజులు) 2023లో ముంబై ఇండియన్స్‌పై సెంచరీ (124 నాటౌట్)గా కొట్టాడు.
ముంబై ఇండియన్స్‌పై సెంచరీ బాదిన యశస్వీ జైస్వాల్ (124 నాటౌట్)
6. ప్రభ్సిమ్రాన్ సింగ్(22 ఏళ్ల, 276 రోజులు) 2023 ఐపీఎల్లో క్యాపిటల్స్‌పై సెంచరీ (103) సాధించాడు.