Kieron Pollard : ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో.. ఆపై ఫ్రాంచైజీ క్రికెట్లో ఉతికేస్తున్న కీరన్ పొలార్డ్(Kieron Pollard) మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. విధ్వంసక ఆటగాడైన పొలార్డ్ టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL)లో 26 బంతుల్లోనే 65 రన్స్ చేసిన ఈ భారీకాయుడు.. ఇటీవల తనను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) నుంచి అగ్రస్థానాన్ని లాగేసుకుడు.
పొట్టి క్రికెట్లో ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్ అత్యధిక పరుగుల రికార్డు బద్ధలైంది. ది హండ్రెడ్ లీగ్‌లో మెరుపు అర్ధ శతకంతో.. కీరన్ పొలార్డ్‌ను దాటేసిన అతడు ఇప్పుడు మళ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో దంచేసిన పొలార్డ్.. 14,921 పరుగులతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బుధవారం.. ట్రిన్బగో నైట్ రైడర్స్ తరఫున 26 బంతుల్లోనే 65 రన్స్ కొట్టిన పొలార్డ్.. మళ్లీ టాప్‌లోకి వచ్చాడు.
Kieron Pollard is back on top of the T20 runs list 🔝 pic.twitter.com/VUpV1jKSDn
— Cricinfo (@cricinfo) August 27, 2026
అంతర్జాతీయంగా, ఫ్రాంచైజీ టీ20ల్లో 749 మ్యాచులు.. 666 ఇన్నింగ్స్‌ల్లో అతడీ మైలురాయిని సాధించాడు. ద్వితీయ స్థానంలో నిలిచిన బట్లర్ ఖాతాలో 14,833 రన్స్ ఉన్నాయి. ప్రస్తుతం టీ20ల్లో పొలార్డ్ 14,921 పరుగులతో టాప్‌లో ఉండగా బట్లర్ 14,833 రన్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ 14,562 పరుగులు, అలెక్స్ హేల్స్ 14,449, డేవిడ్ వార్నర్ 14,284 రన్స్ సాధించారు.
Kieron Pollard is back on top of the T20 runs list 🔝 pic.twitter.com/VUpV1jKSDn
— Cricinfo (@cricinfo) August 27, 2026