మీరంతా దేశం గర్వించేలా చేశారు
ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
- ఆసియాడ్ విజేతలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గురువారం ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో పతకాలు తెచ్చి దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.
భారత్ కేవలం క్రీడా ప్రదర్శనలోనే కాకుండా అంతర్జాతీయ క్రీడాటోర్నీలకు ఆతిథ్యమిచ్చే దేశంగా ఎదుగుతోందని, 2036 ఒలింపిక్స్‌ను దేశంలో నిర్వహించడమే తమ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. ఆసియాడ్‌లో రెండు స్వర్ణాలు, ఓ రజతం నెగ్గిన 17 ఏండ్ల యువ ఆర్చర్ కుంకుమ్ మొహోద్ తన విల్లును ప్రధానికి కానుకగా ఇచ్చింది. టీ20 చాంపియన్‌గా నిలిచిన మహిళల క్రికెట్ జట్టు జెర్సీని మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ప్రస్తుత కెప్టెన్ మంధానలు మోదీకి అందజేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

