హరారే: ఒకానొక సమయంలో ప్రపంచ క్రికెట్లో ప్రముఖ జట్టుగా వెలుగొందిన జింబాబ్వే ఎంత దీనావస్థకు చేరిందో ఆ దేశానికి చెందిన ఓ క్రికెటర్ పరిస్థితి మరోసారి తేటతెల్లం చేసింది. తనకు సరైన బూట్లు కూడా లేవని, జాతీయ జట్టుకు ఆడేందుకు స్పాన్సర్షిప్ ఇవ్వాలని బింబాబ్వే ప్లేయర్ ర్యాన్ బర్ల్ ట్వీట్ చేశాడు. ‘మాకు స్పాన్సర్షిప్ కల్పిస్తే.. ప్రతీ సిరీస్ తర్వాత షూస్‌ను అతికించుకోవాల్సిన పని ఉండదు’ అంటూ చినిగిన తన షూస్ ఫొటోను జత చేశాడు. దీంతో ఫుట్‌వేర్ ఉత్పత్తుల ప్రముఖ సంస్థ పుమా ముందుకొచ్చింది. బర్ల్‌కు స్పాన్సర్షిప్ ఇస్తామని హామీ ఇచ్చింది. 27 ఏండ్ల బర్ల్ జింబాబ్వే తరఫున ఇప్పటి వరకు మూడు టెస్టులు, 18 వన్డేలు, 25 టీ20లు ఆడాడు.