IND vs PAK : పదో సీజన్ పురుషుల టీ20 ప్రపంచకప్ మొదలై మూడు రోజులవుతోంది. లీగ్ దశలో చిన్న జట్లతో తలపడుతున్న పెద్ద టీమ్‌లు.. తదుపరి బిగ్ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాయి. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసే భారత్(IND), పాకిస్థాన్ (PAK) మ్యాచ్‌పై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)తో ఐసీసీ మంతనాలు జరుపుతోంది. బంగ్లాదేశ్ బోర్డు వంత పాడుతుండడంతో ఇదే అనువైన సమయమని గొంతెమ్మ కోర్కెలు కోరుతోంది పీసీబీ.
ప్రపంచ క్రికెట్లో సంపన్నమైన, ప్రభావవంతమైన భారత క్రికెట్ బోర్డును ఒంటిరిగా ఎదుర్కోలేని పాక్ క్రికెట్ బోర్డు కుయుక్తులు పన్నుతోంది. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించిన ఆ దేశ బోర్డు.. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఇండియా మ్యాచ్ బాయ్‌కాట్ ప్రకటనతో ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోంది. బంగ్లాదేశ్ బోర్డును పావులా ఉపయోగించుకుంటున్న పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ.. ఐసీసీ ముందు ఆచరణకు సాధ్యమవ్వని డిమాండ్లు పెట్టాడు.
🚨 REPORTS 🚨
As per unverified information, here’s what the PCB are demanding for the IND vs PAK match on the 15th to go ahead:
💰 An increased share of ICC revenue
🏏 Restoration of bilateral cricket between India and Pakistan
🤝 Reintroduction of handshake protocols with… pic.twitter.com/KsSukdmLnj
— Sportskeeda (@Sportskeeda) February 9, 2026
వరల్డ్‌కప్ ప్రారంభానికి రెండు రోజుల ముందు(ఫిబ్రవరి 5న) భారత జట్టుతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నామని పీసీబీ ప్రకటించింది. అప్పటి నుంచి చిరకాల ప్రత్యర్ధుల మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. దాంతో.. అనిశ్చితికి తెరదించేందుకు ఐసీసీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా (Imran Khawaja) లాహోర్ చేరుకొని చర్చలు జరిపారు. ఈ సందర్బంగా.. ఐసీసీ ముందు పీసీబీ మూడు షరతులు పెట్టిందని క్రిక్‌బజ్ పేర్కొంది. అవేంటంటే.. 1. ఐసీసీ నుంచి పాక్ బోర్డుకు అందే ఆదాయాన్ని గణనీయంగా పెంచాలి. 2. భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించాలి. 3. ఇరుజట్ల మ్యాచ్ సమయంలో ఆనవాతీగా ఆటగాళ్లు కరచాలనం చేసుకోవాలి.
ఈ మూడు డిమాండ్లకు తోడు మరో ఐదు ప్రతిపాదనలకు అంగీకరించాలనిపీసీబీ, బంగ్లాదేశ్ బోర్డు చీఫ్‌లు ఐసీసీ ఉపాధ్యక్షుడికి కోరినట్టు సమాచారం. 2031 వన్డే ప్రపంచకప్ పోటీలకు భారత్, బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తున్నందున తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడించాలని పీసీబీ కోరుతోంది. 1. ప్రస్తుతం 2027 వరకు మాత్రమే ఉన్న హైబ్రిడ్ మోడల్ నిబంధనను 2031 వరకూ పొడిగించాలి. 2. బంగ్లాదేశ్‌కు అదనంగా నష్టపరిహారం చెల్లించాలి. 3. వరల్డ్‌కప్ నుంచి వేటు వేసినందున బంగ్లాదేశ్‌కు పోటీలో ఉన్నట్టుగా లెక్కించి ఫీజు చెల్లించాలి.
4. భవిష్యత్‌లో పాక్, బంగ్లాదేశ్‌కు ఐసీసీ వరల్డ్‌కప్‌ల ఆతిథ్య హక్కులు కట్టబెట్టాలి. 5. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య ముక్కోణపు సిరీస్ ఆడించాలి. టైమ్ చూసి బీసీసీఐని దెబ్బకొట్టాలని చూస్తున్న పాక్ బోర్డు ప్రతిపాదనలకు ఐసీసీ చీఫ్ జై షా తలూపడం అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో బాయ్‌కాట్ నిర్ణయానికే పాక్ కట్టుబడి ఉంటుందా?.. ఐసీసీ ఆంక్షల భయానికి జడిసి యూటర్న్ తీసుకుంటుందా? అనేది త్వరలోనే తెలియనుంది.
భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రభావం.. క్రికెట్ మ్యాచ్‌లపైనా కనిపిస్తోంది. నిరుడు పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టును పంపేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఆ సమయంలో ఇరుదేశాల బోర్డుల మధ్య రాజీ కుదిర్చిన ఐసీసీ.. హైబ్రిడ్ మోడల్‌కు తెరతీసింది. అప్పటి నుంచి పీసీబీ, బీసీసీఐ అంగీకారానికి అనుగుణంగానే తటస్థ వేదికపై దాయాదుల మ్యాచ్ జరుగనుంది. కానీ, మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించడంతో.. ‘మేము ఫిబ్రవరి 15న ఇండియాతో లీగ్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామ’ని పాక్ బోర్డు పేర్కొంది.