Duleep Trophy : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ (Rajat Patidar) మరో టైటిల్ గెలుపొందాడు. అతడి సారథ్యంలోని సెంట్రల్ జోన్ జట్టు (Central Zone).. దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. దాదాపు 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్‌ను ముద్దాడింది ఆ జట్టు. ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌత్ జోన్ (South Zone)పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించిన పాటిదార్.. తన మార్క్ కెప్టెన్సీతో సెంట్రల్ కలను సాకారం చేశాడు.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్ జోన్ ఉత్కంఠ విజయంతో మురిసింది. ఒకదశలో ఓటమి అంచున నిలిచిన ఆ జట్టు.. చిరస్మరణీయ విక్టరీ సాధించింది. సౌత్ జోన్ నిర్దేశించిన 65 పరుగుల లక్ష్య ఛేదనలో సెంట్రల్ జట్టు టాపార్డర్ విఫలమైంది. గుర్జప్నీత్ సింగ్, అంకిత్ కుమార్ విజృంభణతో 24 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
𝐂𝐞𝐧𝐭𝐫𝐚𝐥 𝐙𝐨𝐧𝐞 𝐞𝐧𝐝 𝐚 𝟏𝟎-𝐲𝐞𝐚𝐫 𝐰𝐚𝐢𝐭 𝐭𝐨 𝐜𝐥𝐚𝐢𝐦 𝐭𝐡𝐞 𝐃𝐮𝐥𝐞𝐞𝐩 𝐓𝐫𝐨𝐩𝐡𝐲! 🏆
Rajat Patidar receives the trophy from VVS Laxman post-final. ✨🙌🏼#DuleepTrophy #RajatPatidar #Cricket #Sportskeeda pic.twitter.com/0GDWopkJub
— Sportskeeda (@Sportskeeda) September 15, 2025
ఆ పరిస్థితుల్లో మరో రెండు వికెట్లు పడితే సౌత్ జోన్ ఛాంపియన్ అయ్యేది. కానీ, అక్షయ్ వడ్కర్(19 నాటౌట్), యశ్ రాథోడ్ (13 నాటౌట్)లు అద్భుతంగా ఆడి ప్రత్యర్థి ఆశలపై నీళ్లు చల్లారు. ఈ ఇద్దరూ కీలక ఇన్నింగ్స్ ఆడగా ఆరు వికెట్లతో జయభేరి మోగించింది సెంట్రల్. తద్వారా 11 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ కలను సాకారం చేసుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సెంట్రల్ బౌలర్లు సరన్ష్ జైన్(5-49), కుమార్ కార్తికేయ(4-53) ధాటికి ఆ జట్టు 149 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్‌కు ఓపెనర్ డానిష్ మలేవర్(53) శుభారంభమిచ్చాడు. అనంతరం యశ్ రాథోడ్ (194), కెప్టెన్ రజత్ పాటిదార్(101)లు సౌత్ జోన్ బౌలర్లను ఉతికారేస్తూ సెంచరీలతో చెలరేగారు.
Captain Patidar is having a good year 🏆 🏆 #DuleepTrophy pic.twitter.com/GdU4uJMGes
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2025
యశ్, పాటిదార్ విధ్వంసంతో సెంట్రల్ జట్టు 511 పరుగులతో భారీ ఆధిక్యం సాధించింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ బ్యాటర్లు అసమానంగా ఆడారు. అంకిత్ శర్మ(99), అండ్రే సిద్దార్థ్ (84), స్మరణ్ రవిచంద్రన్ (67)లు అర్ధ శతకాలతో విజృంభించారు. దాంతో.. 426 రన్స్ చేసిన సౌత్ ప్రత్యర్థికి 65 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.