Asia Cup 2023 : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. యార్కర్ కింగ్ మథీశ పథిరన(Matheesha Pathirana) ధాటికి ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దాంతో, బంగ్లా 164 పరుగులకే ఆలౌటయ్యింది. ఆ జట్టు బ్యాటర్లలో నజ్ముల్ హొసేన్ శాంటో(89) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. కొత్త కెప్టెన్ షకిబుల్ హసన్(5) పరుగులతో నిరాశ పరిచాడు. లంక బౌలర్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచడంతో అతడి తర్వాత వచ్చిన వాళ్లు వచ్చనట్టే డగౌట్‌కు చేరారు. శ్రీలంక బౌలర్లలో థీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మొహమ్మద్ నయూం, తంజిద్ హసన్(16) ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే.. రెండో ఓవర్లోనే తంజిద్‌ను థీక్షణ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో, బంగ్లా 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. నయూం కూడా తక్కువకే వెనుదిరిగాడు. ఆ తర్వాత శాంటో ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు.