IND vs SL | పంత్, జురెల్ అర్ధశతకాలు.. లంచ్‌లోపే నాలుగొందలు దాటిన స్కోర్..!
IND vs SL : కొలంబో టెస్టులో భారత కుర్రాళ్లు దంచేస్తున్నారు. శ్రీలంక బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తున్న రిషభ్ పంత్(63 నాటౌట్), ధ్రువ్ జురెల్(59 నాటౌట్)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు.
IND vs SL : కొలంబో టెస్టులో భారత కుర్రాళ్లు దంచేస్తున్నారు. శ్రీలంక బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తున్న రిషభ్ పంత్(63 నాటౌట్), ధ్రువ్ జురెల్(59 నాటౌట్)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు. సరాన్ష్ జైన్(6) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్.. జురెల్ ధనాధన్ ఆడడంతో స్కోర్ నాలుగొందలు దాటేసింది. వీరిద్దరూ శతక భాగస్వామ్యం నెలకొల్పడంతో తొలి సెషన్లో లంక బౌలర్లు బేజారయ్యారు.
కొలంబో టెస్టులో తొలి రోజు 300జ5తో పటిష్ట స్థితిలో నిలిచిన భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. దేవ్‌దత్ పడిక్కల్(117) వరసగా రెండో శతకంతో కదం తొక్కగా.. రెండో రోజూ మిడిలార్డర్ దంచేస్తున్నారు. అరంగేట్రం చేసిన సరాన్ష్ జైన్(6) నిరాశపరిచాడు. తొలి రోజు రిటైర్డ్ హర్ట్ అయిన రిషభ్ పంత్(63 నాటౌట్).. రెండో రోజు తొలి సెషన్లోనే సరాన్ష్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు.
Lunch on Day 2, Colombo: Rishabh Pant returned to bat after Saransh Jain fell early and has now brought up a half-century alongside Dhruv Jurel. India will have eyes on a big first-innings total 📈 pic.twitter.com/Uhc9LEuEex
— Cricinfo (@cricinfo) August 24, 2026
ధ్రువ్ జురెల్(59 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పంత్… ఈ క్రమంలోనే ధోనీ ఆల్‌టైమ్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతేకాదు టెస్టుల్లో 21వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడీ హిట్టర్. ఆ తర్వాత ప్రభాత్ జయసూర్య ఓవర్లో బౌండరీతో జురెల్ సైతం యాభై రన్స్ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికిది మూడో ఫిఫ్టీ. వీరిద్దరూ శతక భాగస్వామ్యం నెలకొల్పగా.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 రన్స్ చేసింది.
And Dhruv Jurel gets to his fifty as well! 💪
His third half-century in Test Cricket 👏👏
4⃣0⃣0⃣ up for #TeamIndia!
Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/I4uyXVh3q9
— BCCI (@BCCI) August 24, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

