IND vs SA | హాఫ్ సెంచరీతో మెరిసిన పాండ్యా.. సఫారీల ముందు భారీ టార్గెట్..!
IND vs SA : పునరాగమనం మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా(59 నాటౌట్) రెచ్చిపోయాడు. ఇటీవలే స్మాట్‌లో మెరుపులు మెరిపించిన పాండ్యా.. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపైనే చెలరేగాడు. ఈ ఆల్‌రౌండర్ ఫోర్లు, సిక్సర్లు బాదేయగా టీమిండియా భారీస్కోర్ చేసింది.
IND vs SA : పునరాగమనం మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా(59 నాటౌట్) రెచ్చిపోయాడు. ఇటీవలే స్మాట్‌లో మెరుపులు మెరిపించిన పాండ్యా.. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపైనే చెలరేగాడు. క్రీజులోకి వచ్చీరాగానే ఈ ఆల్‌రౌండర్ ఫోర్లు, సిక్సర్లు బాదేయగా టీమిండియా భారీస్కోర్ చేసింది. పవర్ ప్లేలో లుంగి ఎంగిడి(3-31) విజృంభణతో కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ అభిషేక్ శర్మ(17), తిలక్ వర్మ(26)లు ఆదుకున్నారు. వీరిద్దరి తర్వాత అక్షర్ పటేల్(23) జతగా పాండ్యా చితక్కొట్టాడు. చివరి ఓవర్లో 12 రన్స్ పిండుకోవడంతో ప్రత్యర్ధికి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా.
వన్డే సిరీస్‌లో అదిరే ఆటతో సఫారీలకు చెక్ పెట్టిన భారత జట్టు టీ20 తొలి పోరులో భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాపార్డర్ విఫలమైనా.. హార్దిక్ పాండ్యా(59 నాటౌట్) విధ్వంసంతో సఫారీలకు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది సూర్యకుమార్ సేన. టాస్ ఓడిన భారత్‌కు తొలి ఓవర్లోనే షాకిస్తూ శుభ్‌మన్ గిల్(4)ను ఔట్ చేశాడు లుంగి ఎంగిడి(). బౌండరీ కొట్టిన గిల్.. ఆ తర్వాత టైమింగ్ కుదరక 30 యార్డ్ సైకిల్లోనే క్యాచ్ ఇచ్చేసి వెళ్లాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) యాన్సెన్ ఓవర్ తర్వాత తన స్టయిల్ ఆట మొదలు పెట్టాడు.
𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 𝐨𝐟 𝐌𝐚𝐱𝐢𝐦𝐮𝐦𝐬 💯
1⃣0⃣0⃣ T20I sixes for Hardik Pandya 🔥
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/mZjJXhr5S9
— BCCI (@BCCI) December 9, 2025
ఎంగిడి ఓవర్లో లెగ్ సైడ్ బౌండరీ, సిక్సర్ బాది జోష్ నింపాడు. కానీ, నాలుగో బంతికి మర్క్రమ్ చేతికి చిక్కాడు. దాంతో.. 17కే రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం ఓపెనర్ అభిషేక్ శర్మ(17), తిలక్ వర్మ(26) ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే.. సిమ్లా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్.. హ్యాట్రిక్ షాట్ మిస్సై ఔటయ్యాడు. కాసేపటికే యాన్సెన్ బౌండరీ వద్ద సూపర్ క్యాచ్ పట్టగా తిలక్ సైతం వెనుదిరిగాడు.
పాండ్యా విధ్వంసం
తిలక్ ఔట్ కావడంతో 78కే నాలుగు వికెట్లు పడిన వేళ క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(59 నాటౌట్) ఆలస్యం చేయకుండా.. కేశవ్ మహరాజ్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. సిపమ్ల ఓవర్లో స్ట్రెయిట్ సిక్సర్‌తో స్కోర్ వంద దాటించిన అక్షర్ పటేల్(23) .. ఆ వెంటనే బ్యాక్వర్డ్ పాయింట్లో కట్ షాట్ ఆడి ఫెరారీ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత జోరు పెంచిన పాడ్యా.. ఓవర్లో 6,4 తో స్కోర్ 150 దాటింది. నోర్జి వేసిన 20వ ఓవర్లో పాండ్యా 6, 4 కొట్టగా టీమిండియా 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన పాండ్యా టీ20ల్లో వంద సిక్సర్ల క్లబ్లో చేరాడు.
𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 𝐨𝐟 𝐌𝐚𝐱𝐢𝐦𝐮𝐦𝐬 💯
1⃣0⃣0⃣ T20I sixes for Hardik Pandya 🔥
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/mZjJXhr5S9
— BCCI (@BCCI) December 9, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

