SLW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్లో మరో ఆసక్తికర పోరుకు మరికాసేపట్లే తెరలేవనుంది. వరల్డ్ కప్ రెండో మ్యాచ్లో ఆసియా జట్లు అయిన శ్రీలంక (Srilanka), పాకిస్థాన్ (Pakistan)లు తలపడున్నాయి. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ చాంపియన్ అయిన లంకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడమే తమ ఉద్దేశమని ఆమె చెప్పింది.
ఇరుజట్లు ఢీకొన్న గత మూడు మ్యాచుల్లో లంకదే పైచేయి అయింది. దాంతో.. ఆ ఓటమలుకు బదులు తీర్చుకొని మెగా టోర్నీలో బోణీ కొట్టాలని పాకిస్థాన్ పట్టుదలతో ఉంది. మరోవైపు.. ఆసియా కప్ విజేతగా నిలిచిన చమరి ఆటపట్టు బృందం విజయంతో వరల్డ్ కప్ వేటను మొదలెట్టాలని భావిస్తోంది.
Fatima Sana wins the toss and Pakistan will bat first https://t.co/TkaJO1ET95 | #T20WorldCup pic.twitter.com/61EdLRzwaV
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2024
శ్రీలంక జట్టు : విశ్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్హరి, అనుష్కా సంజీవని(వికెట్ కీపర్), నీలాక్షి డిసిల్వా, హాసిని పెరీరా, సుగంధిక కుమారి, ఇనోషి ప్రియదర్శిని, సచిని నిసనసాల, ఉదేశికా ప్రభోదిని.
పాకిస్థాన్ జట్టు : మునీబా అలీ(వికెట్ కీపర్), గుల్ ఫెరోజా, సాద్రా అమిన్, నిదా దార్, అలియా రియాజ్, ఫాతిమా సనా(కెప్టెన్), టుబా హస్సన్, నష్రా సంధు, డయానా బైగ్, సాధిక్ ఇక్బాల్, ఒమైమా సొహైల్.