Javeria Khan | వైభవంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ పెండ్లి.. ఫొటోలు వైరల్
Javeria Khan ; పాకిస్థాన్ క్రికెట్లో పెండ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. ఈ మధ్యే మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మూడో వివాహంతో వార్తల్లో నిలవగా.. తాజాగా మహిళల జట్టు మాజీ కెప్టెన్ జవేరియా ఖాన్..
Javeria Khan ; పాకిస్థాన్ క్రికెట్లో పెండ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. ఈ మధ్యే మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మూడో వివాహంతో వార్తల్లో నిలవగా.. తాజాగా మహిళల జట్టు మాజీ కెప్టెన్ జవేరియా ఖాన్ (Javeria Khan) పెండ్లి చేసుకుంది. ఆదివారం కరాచీలో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జవేరియా, వకాస్(Waqas)ల వివాహం వైభవంగా జరిగింది.
జవేరియా నిఖాకు మాజీ కెప్టెన్ సనా మిర్(Sana Mir), అయేషా జాఫర్(Ayesha Jafar) హాజరయ్యారు. తన పెండ్లి పెండ్లి వేడుక ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఆల్రౌండర్ అయిన జవేరియా 2008లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసింది. పదేండ్ల సుదీర్ఘ కెరీర్లో 116 వన్డేలు, 112 టీ20లు ఆడింది.
వన్డేల్లో 2,885 రన్స్, పొట్టి ఫార్మాట్లో 2,018 పరుగులు చేసింది. ఆమె ఖాతాలో రెండు సెంచరీలు, 25 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతేకాదు 17 వన్డేలు, 16 టీ20ల్లో పాక్ జట్టు కెప్టెన్గా వ్యవహరించింది. కెరీర్ సాఫీగా సాగుతుండగానే 2022లో వన్డేలకు జవేరియా వీడ్కోలు పలికింది. ఇక పొట్టి ఫార్మాట్లో నిరుడు ఆఖరి మ్యాచ్ ఆడేసింది.
ఇవి కూడా చదవండి
- KCR | బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు.. నల్గొండ సభతో ఉద్యమం ఉధృతం చేద్దాం : కేసీఆర్
- MP TR Baalu: లోక్సభలో డీఎంకే వర్సెస్ బీజేపీ.. ఎంపీ బాలు వ్యాఖ్యలపై నిరసన
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

