Shoaib Malik | మూడేండ్లుగా ఆమెతో ప్రేమలో.. వారించినా వెనక్కి తగ్గని షోయబ్ మాలిక్..!
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మూడో పెండ్లితో వార్తల్లో విషయం తెలిసిందే. టీవీ నటి, మోడల్ అయిన సనా జావేద్(Sana Javed)ను జనవరి 22న షోయబ్ మనువాడాడు. అయితే.. వీళ్లిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉందని, ఇద్దరూ మూడేండ్లుగా ప్రేమలో ఉన్నారనే...
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మూడో పెండ్లితో వార్తల్లో విషయం తెలిసిందే. టీవీ నటి, మోడల్ అయిన సనా జావేద్(Sana Javed)ను జనవరి 22న షోయబ్ మనువాడాడు. అయితే.. వీళ్లిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉందని, ఇద్దరూ మూడేండ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోయమ్ మాలిక్‌తో పెండ్లికి మూడు నెలల ముందే సనా తన భర్త ఉమైర్ జస్వాల్‌కు విడాకులు ఇచ్చిందని ఆ దేశానికి చెందిన సమా టీవీ(Samaa TV) అనే టీవీ చానెల్లో ప్రసారమైన ఒక పోడ్కాస్ట్ వెల్లడించింది.
అంతేకాదు షోయబ్‌ను ఎప్పుడు షోకు పిలిచినా అతడు సనా ఉండాల్సిందేనని పట్టుపట్టేవాడని తెలిపింది. ‘సనా, షోయబ్ మధ్య మూడేండ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ విషయం సనా మొదటి భర్త జస్వాల్‌కు కూడా తెలియదు. సానియా మిర్జాతో పోటు షోయబ్ మాలిక్ కుటుంబసభ్యులకు కూడా నిరుడే ఈ విషయం తెలుసు. సనాతో ప్రేమ వ్యవహారానికి ముగింపు పలకాలని ఇంట్లోవాళ్లు ఎంత చెప్పినా షోయబ్ మాత్రం వెనక్కి తగ్గలేదు’ అని సమా టీవీ పోడ్కాస్ట్ ప్రొడ్యూసర్ వెల్లడించాడు.
షోయబ్ మాలిక్, సనా జావేద్, సానియా మిర్జా

సానియా మిర్జా కంటే ముందు మాలిక్ హైదరాబాద్‌కే చెందిన అయేషా సిద్దిఖీ(Ayesha Siddiqui)కి 2002లో పెండ్లి చేసుకున్నాడు. అయితే.. 2010లో ఆమెతో వివాహ బంధానికి స్వస్తి పలికి సానియాను మనువాడాడు. 2010లో షోయబ్ మాలిక్, సానియా మిర్జాల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్లో వలీమా వేడుక జరిగింది. వీళ్లకు ఇజాన్(Izhaan) అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. షోయబ్ ప్రేమవ్యవహారాలతో విసిగిపోయిన సానియా విడాకులు ఇచ్చేసింది. ‘షరియా చట్టం’లోని ‘ఖులా'(Khula) పద్ధతిలో తన కూతురు షోయబ్‌కు వీడ్కోలు ఇచ్చిందన సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి
- Newzealand | వరల్డ్ కప్ హీరోకు టెస్టు చాన్స్.. కేన్ మామ వచ్చేస్తున్నాడు
- Tata Tiago-Tiago | మూడు కొత్త కలర్ ఆప్షన్లలో టాటా టియాగో, టైగోర్.. ఇవీ డిటైల్స్..!
- TTD | టీటీడీ ఆధీనంలోకి మరో రెండు ఆలయాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

