Tata Tiago-Tiago | మూడు కొత్త కలర్ ఆప్షన్లలో టాటా టియాగో, టైగోర్.. ఇవీ డిటైల్స్..!
Tata Tiago-Tiago | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారత్ మార్కెట్లోకి టాటా టియాగో, టాటా టియాగో ఎన్ఆర్జీ, టాటా టైగోర్ మోడల్ కార్లు కొత్త కలర్ ఆప్షన్లలో రానున్నాయి.
Tata Tiago-Tiago | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారత్ మార్కెట్లోకి టాటా టియాగో, టాటా టియాగో ఎన్ఆర్జీ, టాటా టైగోర్ మోడల్ కార్లు కొత్త కలర్ ఆప్షన్లలో రానున్నాయి. మరోవైపు టాటా టియాగో, టాటా టైగర్ – సీఎన్జీ పవర్ ట్రైన్ వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి కొనుగోలు కోసం కస్టమర్ల నుంచి రూ.21 వేల టోకెన్ మనీ చెల్లిస్తే సరి. సీఎన్జీ ఆటోమేటిక్ ఆప్షన్‌తో టాటా మోటార్స్.. కొత్తగా టియాగో, టైగర్ మోడల్ కార్లు కొత్త (ఎక్స్టీరియర్) కలర్స్‌లో ఆవిష్కరించింది.
టోర్నాడో బ్లూ కలర్లో టాటా టియాగో
అరిజోనా బ్లూ కలర్ ఆప్షన్ స్థానే టాటా టియాగో మోడల్ కారు టొర్నాడో బ్లూ ఎక్స్టీరియర్ షేడ్‌లో వస్తుంది. టొర్నాడో బ్లూ షేడ్ బ్రైటర్గా కనిపిస్తుంది. ఎక్స్‌జడ్+ తోపాటు టాప్ హైఎండ్ వేరియంట్లలో డ్యుయల్-టోన్ షేడ్ ఉంటుంది. ఎక్స్‌టీ, ఎక్స్‌టీ సీఎన్జీ, ఎక్స్జడ్ఓ+, ఎక్స్‌జడ్ + సీఎన్జీ వేరియంట్ మోడల్ కార్లు టొర్నాడో బ్లూ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటాయి.
ఇలా టాటా టియాగో ఎన్ఆర్జీ
టాటా టియాగో ఎన్ఆర్జీ మోడల్ కారు ఫారెస్టా గ్రీన్ కలర్ స్థానే ఎక్స్టీరియర్గా గ్రాస్లాండ్ బీజ్ ఎక్స్టీరియర్ పెయింట్ ఆప్షన్‌తో వస్తుంది. మోనోటోన్, డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్‌టీ ఎన్ఆర్జీ, ఎక్స్‌టీ ఎన్ఆర్జీ సీఎన్జీ, ఎక్స్‌జడ్ ఎన్ఆర్జీ, ఎక్స్‌జడ్ ఎన్ఆర్జీ సీఎన్జీ వేరియంట్ కార్లు గ్రాస్ లాండ్ బీజ్ కలర్లో లభిస్తాయి.
మీటోర్ బ్రాంజ్ కలర్లో టైగోర్
టాటా టైగోర్ కారు లైట్ బ్రైన్ హ్యూ స్థానే మీటోర్ బ్రాంజ్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. ఇది మోనోటోన్ స్కీంలో మాత్రమే అందుబాటులో ఉంది. టైగోర్ ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్ సీఎన్జీ, ఎక్స్‌జడ్+, ఎక్స్‌జడ్+ సీఎన్జీ వేరియంట్లు మాత్రమే మీటోర్ బ్రాంజ్ కలర్లో లభిస్తాయి.
ఇలా ఫీచర్స్.. సేఫ్టీ ఆప్షన్లు
టాటా టియాతో, టైగోర్ మోడల్ కార్లు 7-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, సెమీ డిజిటల్ డ్రైవర్స్ డిస్ ప్లే, ఆటోమేటిక్ ఏసీ, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతోపాటు ఏబీఎస్, రేర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
పవర్ట్రైన్.. ట్రాన్మిషన్ ఆప్షన్లు ఇలా
టాటా టియాగో, టాటా టైగోర్ కార్లు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ (86 పీఎస్ / 113 ఎన్ఎం) తో వస్తున్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లతో వస్తాయి. సీఎన్జీ వేరియంట్లలోనే ఇదే ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ గరిష్టంగా 73.5 పీఎస్ విద్యుత్ 95 ఎన్ఎం టార్క్ వెలువరించడంతోపాటు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లో లభిస్తాయి. త్వరలో 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లో టియాగో, టైగోర్ వేరియంట్లు లభిస్తాయి. అదే జరిగితే భారత్ మార్కెట్లో సీఎన్జీ ఆటోమేటిక్ వర్షన్లలో లభించే తొలి కార్లు కానున్నాయి. టియాగో, టైగోర్ సీఎన్జీ వేరియంట్లు ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో యూజబుల్ బూట్ స్పేస్ కలిగి ఉంటాయి.
ఇవీ ధరవరలు
టాటా టియాగో కారు రూ.5.60 లక్షల నుంచి రూ.8.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతున్నాయి. టాటా టియాగో రూ.6.30 లక్షల నుంచి రూ.8.95 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి. మారుతి సుజుకి సెలెరియో, మారుతి వాగన్ఆర్, సిట్రోన్ సీ3తో టాటా టియాగో, మారుతి డిజైర్, హోండా అమేజ్, హ్యుండాయ్ ఔరా మోడల్ కార్లతో టాటా టైగోర్ పోటీ పడతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

