Sourav Ganguly | గంగూలీకి ప్రమోషన్.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా పగ్గాలు..!
Sourav Ganguly : భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)కి ప్రమోషన్ లభించనుంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్రధాన కోచ్ పదవి దాదాను వరించనుంది.
Sourav Ganguly : భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)కి ప్రమోషన్ లభించనుంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్రధాన కోచ్ పదవి దాదాను వరించనుంది. ప్రస్తుతం ఢిల్లీ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలందిస్తున్న గంగూలీ.. 2027 సీజన్లో హెడ్‌కోచ్ కానున్నాడు. తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ వచ్చే ఎడిషన్‌కు కోచింగ్ యూనిట్‌ను పటిష్టం చేసుకోవాలనుకోవడమే అందుకు కారణం. అయితే.. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం ధ్రువీకరించాల్సి ఉంది.
ఐపీఎల్ 19వ సీజన్లో నిరాశపరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే ఎడిషన్‌కు పక్కాగా సిద్ధమవ్వాలనుకుంటోంది. ఈక్రమంలోనే ఆటగాళ్లను మార్చడమే కాదు.. కోచింగ్ దళాన్ని పటిష్టం చేసుకోవాలని డీసీ భావిస్తోంది. అందుకని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh)కు బ్యాటింగ్ కోచ్ పదవి కట్టబెట్టనున్న ఢిల్లీ.. ప్రధాన కోచ్ హేమంగ్ బదొని(Hemang Badoni)పై వేటు వేయనుంది.
🚨 NEW HEAD COACH IN DC 🚨
– Sourav Ganguly is set to become the new head coach of the Delhi Capitals. pic.twitter.com/TLZze0y2PB
— lndian Sports Netwrk (@IS_Netwrk29) June 20, 2026
బదొని స్థానంలో సౌరవ్ గంగూలీని హెడ్‌కోచ్‌గా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోందని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. ఎస్ఏ 20 లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ ప్రిటోరియా క్యాపిటల్స్(Pretoria Capitals)కు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం దాదాకు ఉంది. దాంతో, ఐపీఎల్‌లోనూ గంగూలీకి జట్టును సానబెట్టే బాధ్యత ఇవ్వాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ భావిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

