Michael Phelps : అమెరికాకు చెందిన మైఖేల్ ఫెల్ఫ్స్(Michael Phelps) ఈత కొలనులో బంగారు చేపగా ప్రసిద్దికెక్కిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో అతడు నీళ్లలోకి దిగిన ప్రతిసారి పసిడి పతకం కొల్లగొట్టేవాడు. రిటైర్మెంట్ ప్రకటించిన ఫెల్ఫ్స్ తాజాగా అభిమానులకు తీయని కబురు చెప్పాడు. తాను వచ్చే ఏడాది నాలుగోసారి తండ్రి కాబోతున్నానని ఇన్స్టాగ్రామ్ సాక్షిగా వెల్లడించాడు.
ఫెల్ప్స్ ఆన్లైన్లో షేర్ చేసిన వాటిలో.. తమ పెండ్లి రోజు ఫొటోతో పాటు వివాహ వార్షికోత్సవ ఫొటోలు ఉన్నాయి. ఈ దంపతులకు బూమర్(7 ఏండ్లు), బెకెట్(5 ఏండ్లు), మ్యావెరిక్(3 ఏండ్లు) అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఫెల్ఫ్స్ భార్య నికొలె జాన్సన్ 2024లో నాలుగో బిడ్డకు జన్మనివ్వనుంది.
స్విమ్మింగ్ పూల్‌లో రారాజుగా వెలుగొందిన ఫెల్ఫ్స్ ఒలింపిక్స్‌లో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. ఐదు విశ్వక్రీడల్లో పోటీపడిన ఫెల్ప్స్.. వ్యక్తిగత బటర్ ఫ్లై, జట్టు విభాగంలో కలిపి 28 మెడల్స్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్ గెలిచిన స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాడు. మిస్ క్యాలిఫోర్నియా అయిన నికొలెను ఫెల్ప్స్ 2016లో పెండ్లి చేసుకున్నాడు.