ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్లో ఆఖరి సెమీస్ బెర్తుపై కన్నేసిన న్యూజిలాండ్ కీలక మ్యాచ్లో శ్రీలంకతో తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈమ్యాచ్లో టాస్ గెలిచిన విలియమ్సన్ బౌలింగ్ తీసుకున్నాడు. చావోరేవో లాంటి ఈ పోరులో కివీస్ ఇష్ సోధీ స్థానంలో లూకీ ఫెర్గూసన్ను ఆడిస్తోంది. ఇక పరువు కోసం పోరాడనున్ను కుశాల్ మెండిస్ సేన కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నేను తీసుకుంది.
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిఫ్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫెర్గూసన్.
శ్రీలంక : పథుమ్ నిస్సంక, కుశాల్ పెరీర, కుశాల్ మెండిస్(కెప్టెన్), సమరవిక్రమ, అసలంక, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, థీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మధుశనక.