Babar Azam: బాబర్ వైఫల్యానికి కారణమదే.. అతడి అసలు ఆట ఇప్పుడు చూడొచ్చు : బీజేపీ ఎంపీ కామెంట్స్
Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి బాబర్ ఆజమ్ వన్డే ప్రపంచకప్ వైఫల్యంపై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి బాబర్ ఆజమ్ వన్డే ప్రపంచకప్ వైఫల్యంపై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ వల్ల బాబర్ ఒత్తిడికి గురయ్యాడని, అది లేకపోవడంతో అతడి అసలు ఆటను ఇప్పుడు చూడొచ్చని గంభీర్ తెలిపాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ గంభీర్ ఈ కామెంట్స్ చేశాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అతడి మీద ఒత్తిడి ఉండదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బాబర్ ఆ సిరీస్‌లో రాణించి తిరిగి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్న నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం అయితే బాబర్ ఆజమ్లోని అత్యుత్తమ ఆటను ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు అతడికి కెప్టెన్సీ ప్రెషర్ లేదు. వరల్డ్ కప్ కంటే ఇప్పుడు డిఫరెంట్ బాబర్‌ను మనం చూడొచ్చు. వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు అతడు ఈ టోర్నమెంట్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడని నేను చెప్పాను. కానీ కెప్టెన్సీ ఒత్తిడి వల్ల అతడు తన సామర్థ్యానికి మించి రాణించలేకపోయాడు..
Gautam Ghambir🗣️ “i think you’ll see the best of Babar Azam now”#BabarAzampic.twitter.com/r7s59J32XG
— Hassan (@HassanAbbasian) December 8, 2023
ప్రపంచకప్‌లో సారథిగా చేస్తూ సరిగా రాణించకుంటే ఆ కెప్టెన్‌పై ఒత్తిడి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కానీ ఇప్పుడు బాబర్‌కు ఆ తలనొప్పి లేదు. బాబర్ ఆజమ్ రికార్డుల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ అతడి అసలైన ఆటను మాత్రం ఇప్పుడు చూడొచ్చు…’ అని తెలిపాడు. బాబర్ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని, పాకిస్తాన్ నుంచి వచ్చిన బెస్ట్ బ్యాటర్లలో అతడు ఒకడిగా నిలుస్తాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

