Novok Djokovic | జొకోవిచ్ దస్ కా దమ్.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ కైవసం
Novok Djokovic | అచ్చొచ్చిన మైదానంలో నొవాక్ జొకోవిచ్ మరోసారి విజృంభించాడు. మెల్బోర్న్లో తనకు తిరుగులేదని చాటుతూ.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
Novok Djokovic | పదిహేనేండ్ల క్రితం తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గిన సమయంలో జొకోవిచ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దుందుడుకు వ్యక్తిత్వం.. మైదానంలో ప్రత్యర్థిని రెచ్చగొట్టే చేష్టలు.. విజయం సాధిస్తే గ్రౌండ్‌లోని గడ్డిని నోట్లో పెట్టుకొని ఫొటోలకు ఫోజివ్వడం.. ఇలా అతడి ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో జొకో ఎక్కువ కాలం ఆడలేడని ఒక అంచనాకు వచ్చేశారు. 2008 ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిన జో విల్ఫ్రెడ్ సొంగా మాత్రం.. రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించాడు. భవిష్యత్తులో జొకో ప్రపంచాన్ని ఏలుతాడని కితాబిచ్చాడు. పదిహేనేండ్లు తిరిగేసరికి సోంగా మాటలు నిజమయ్యాయి. తాజా ఆస్ట్రేలియా ఓపెన్ విజయంతో జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 22కు చేరింది. రఫేల్ నాదల్‌తో కలిసి అత్యధిక టైటిల్స్ జాబాతాలో అగ్రస్థానానికి చేరిన జొకో.. మున్ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.
మెల్బోర్న్: అచ్చొచ్చిన మైదానంలో నొవాక్ జొకోవిచ్ మరోసారి విజృంభించాడు. మెల్బోర్న్లో తనకు తిరుగులేదని చాటుతూ.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఓపెన్ ఎరాలో ఉద్దండపిండాలతో కలిఇ ఆడుతూనే 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. 2008లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్.. ఆ తర్వాత 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023లో విజయ గర్జన చేశాడు. రాడ్ లీవర్ ఎరీనాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో నాలుగో సీడ్ జొకోవిచ్ 6-3, 7-6 (7/4), 7-6 (7/5)తో స్టిఫానోస్ సిట్సిపాస్‌పై విజయం సాధించాడు. సెర్బియా నుంచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన నొవాక్ జొకోవిచ్.. ఆ తరవాత ఈ దాహం తీరనిదీ అంటూ ఒకదాని వెంట ఒకటి నెగ్గుతూ తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 22కు పెంచుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో రాఫెల్ నాదల్ (22)తో కలిసి అగ్రస్థానంలో ఉన్న నొవాక్.. మరో రెండు మూడేండ్లు ప్రొఫెషనల్ కెరీర్ కొనసాగిస్తే ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయమే!
గతేడాది కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంగా జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యాక్సిన్ తప్పనిసరి చేయగా.. జొకోవిచ్ అందుకు ససేమీరా అన్నాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడే చాన్స్ కోల్పోయాడు. అయితే ఏమాత్రం వెనకడుగు వేయని జొకో.. ఈసారి బదులు తీర్చుకున్నాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో 10సారి టైటిల్ ముద్దాడాడు. రఫేల్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్, రోజర్ ఫెదరర్‌కు వింబుల్డన్ ఎలా ఇష్టమైన టైటిల్సో.. అలాగే ఆస్ట్రేలియా ఓపెన్‌ను సొంతం చేసుకున్న 35 ఏండ్ల జొకోవిచ్.. ఇక్కడ తనకు ఎదురేలేదని మరోసారి చాటాడు. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తన చేతిలో ఓడిన సిట్సిపాస్‌ను మరోసారి చిత్తు చేస్తూ 22వ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
ఆస్ట్రేలియా ఓపెన్: 10 (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023)
ఫ్రెంచ్ ఓపెన్: 2 (2016, 2021)
వింబుల్డన్: 7 (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022)
యూఎస్ ఓపెన్: 3 (2011, 2015, 2018)
Read More :
Shefali Verma | నాకు బర్త్ డే గిఫ్ట్‌గా వరల్డ్ కప్ ట్రోఫీ కావాలి : షెఫాలీ వర్మ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

