Shefali Verma | నాకు బర్త్ డే గిఫ్ట్‌గా వరల్డ్ కప్ ట్రోఫీ కావాలి : షెఫాలీ వర్మ
భారత అండర్-19 జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తనకు బర్త్ డే గిఫ్ట్‌గా వరల్డ్ కప్ ట్రోపీ కావాలని సభ్యులకు చెప్పింది. శనివారం నాటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్, ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది.
Shefali Verma : మరికాసేపట్లో మహిళల అండర్-19 టీ20 ఫైనల్ ప్రారంభం కానుంది. దాంతో, జట్టును ఒక్కటిగా నడిపించేందుకు భారత అండర్-19 జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తనకు బర్త్ డే గిఫ్ట్‌గా వరల్డ్ కప్ ట్రోపీ కావాలని సభ్యులకు చెప్పింది. శనివారం నాటికి ఆమె వయసు 19 ఏళ్లు. దాంతో, టీమ్‌ను ప్రోత్సహించడం కోసం ఆమె.. ‘నాకు పుట్టినరోజు బహుమతిగా వరల్డ్ కప్ ట్రోఫీ కావాలి. మరొకటి వద్దు’ అని చెప్పింది. ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్, ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది. ఐసీసీ మొదటిసారి నిర్వహిస్తున్న ట్రోఫీ కావడంతో ఇరుజట్లు టైటిల్‌పై కన్నేశాయి.
భారత్ బలం వీళ్లే..
అండర్-19 టీ20 వరల్డ్ కప్ టైటిల్ పోరులో భారత్‌కు ఓపెనర్లు శ్వేతా షెహ్రావత్, షెఫాలీ వర్మ, స్పిన్నర్ పర్షవి చోప్రా కీలకం కానున్నారు. వీళ్లు మరోసారి చెలరేగితే టీమిండియా మ్యాచ్ గెలవడం ఖాయం. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో పర్షవి 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఓపెనర్ శ్వేతా హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. దాంతో 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

