Najibullah Zadran | 2015 వరల్డ్ కప్లో ధోనీ ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా : అఫ్గానిస్థాన్ క్రికెటర్
ధోనీ తన ఆరాధ్య ఆటగాడు అని, 2015 వరల్డ్ కప్ సమయంలో ఈ వెటరన్ క్రికెటర్ తనకు చెప్పిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని అఫ్గానిస్థాన్ క్రికెటర్ నజీబుల్లాహ్ జద్రాన్ తెలిపాడు.
Najibullah Zadran : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని వర్ధమాన క్రికెటర్లు ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే. అంతేకాదు ధోనిని కలిసిన విదేశీ క్రికెటర్లు అతడు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తాజాగా అఫ్గానిస్థాన్ క్రికెటర్ నజీబుల్లాహ్ జద్రాన్, ధోనీ తన ఆరాధ్య ఆటగాడు అని తెలిపాడు. ధోనీ నా ఆరాధ్య ఆటగాడు. అతడిలా మరొకరు మ్యాచ్ను ముగించలేరు. అతడిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. 2015 వరల్డ్ కప్ సమయంలో ఈ వెటరన్ క్రికెటర్ తనకు చెప్పిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని వెల్లడించాడు. 2015 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఎం.ఎస్.ధోనీతో మాట్లాడాను. ‘తీవ్రమైన ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లోనూ నువ్వు ప్రశాంతంగా ఉండు. నిన్ను నీవు నమ్ము’ అని చెప్పాడు. ఆ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నాను’ అని నజీబుల్లాహ్ చెప్పుకొచ్చాడు. అతను ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టకు ఆడుతున్నాడు.
2015 వరల్డ్ కప్లో అనేది అఫ్గానిస్థాన్కు తొలి మెగా టోర్నీ. ఆరు మ్యాచుల్లో ఒక్క విజయంతో అఫ్గానిస్థాన్ తమ గ్రూప్లో ఐదో స్థానంలో నిలిచింది. ఆ టోర్నమెంట్లో ధోనీ కెప్టెన్సీలోని భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ, తెలివిగా నిర్ణయాలు తీసుకొనే నైజం ధోనీకి అంతర్జాతీయంగా పేరు తెచ్చింది. ధోనీ సారథ్యంలో భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2007 పొట్టి ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

