న్యూయార్క్: పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కేందుకు తహతహలాడుతున్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు యూఎస్ ఓపెన్ రూపంలో చక్కటి అవకాశం ఎదురైంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ మెగాటోర్నీకి సూపర్ స్టార్లు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫేల్ నాదల్ (స్పెయిన్) దూరం కావడంతో జొకో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. అధునిక టెన్నిస్‌లో టాప్-3గా పేరు తెచ్చుకున్న ఈ ముగ్గురు ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమంగా ఉండగా.. ఇప్పుడు నాదల్, ఫెదరర్‌ను అధిగమించి టాప్కు చేరే అవకాశం జొకోవిచ్ ముందు ఉంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న యూఎస్ ఓపెన్ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్న జొకోవిచ్‌కు.. సిట్సిపాస్, జ్వెరెవ్, మెద్వెదెవ్ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశాలుండగా.. గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే యూఎస్ ఓపెన్‌తో పునరాగమనం చేస్తున్నాడు. మానసిక ఆందోళన కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నవోమీ ఒసాక (జపాన్) మహిళల విభాగంలో ఫెవరెట్‌గా బరిలో దిగుతుండగా.. గాయం కారణంగా సెరెనా విలియమ్స్ పోటీ నుంచి తప్పుకుంది.