మెల్బోర్న్: టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడేందుకు ఆ దేశానికి వెళ్లిన జోకోవిచ్‌కు అకస్మాత్తుగా వీసా రద్దు చేశారు. కోవిడ్ టీకాలు తీసుకోని కారణంగా అతన్ని ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ డిపోర్ట్ సెంటర్లోనే ఉంచారు. సరైన కోవిడ్ మినహాయింపు పత్రాన్ని కూడా జోకో చూపలేదు. జోకోవిచ్ రూల్స్ ఉల్లంఘించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కూడా అన్నారు. అయితే కోవిడ్ టీకాలు తీసుకోకుండా ఆస్ట్రేలియాకు వచ్చిన జోకోవిచ్‌పై మరో స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫేల్ నాదల్ రియాక్ట్ అయ్యారు. జోకోవిచ్ స్వంత నిర్ణయాలు తీసుకున్నాడని, ప్రతి ఒక్కరూ అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అని, కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు సరికావు అని నాదల్ అన్నారు. కోవిడ్ టీకాలు తీసుకోకపోవడం వల్లే జోకోకు ఆస్ట్రేలియా ఎంట్రీ కష్టమవుతోందన్నాడు. నిజానికి గత నెలలో నాదల్కు కరోనా సోకింది. కానీ అతను రెండు డోసుల టీకాలు తీసుకున్నాడు. ఒకవేళ టీకాలు తీసుకుని ఉంటే.. ఇక్కడ ఆడేందుకు సమస్య ఏమీలేదన్నాడు. వ్యాక్సిన్లు వేసుకుంటే ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే కాదు.. ఎక్కడైనా ఆడే వీలు ఉంటుందని నాదల్ అన్నాడు. మరో వైపు జోకోవిచ్ ఆస్ట్రేలియా కోర్టును ఆశ్రయించాడు.