Novak Djokovic | జకోవిచ్ ఛాతీపై చిప్.. అదొక పెద్ద రహస్యమన్న సెర్బియా స్టార్
Novak Djokovic : వరల్డ్ నంబర్ 3 నొవాక్ జకోవిచ్(Novak Djokovic ) ఫ్రెంచ్ ఓపెన్‌లో అదరగొడుతున్నాడు. అతను రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ పై గురిపెట్టాడు. అయితే.. అతడి ఛాతిపై చిప్(Chip) ఉండడం చర్చనీయాంశమైంది. ఇదే విషయమై అతడిని ప్రశ్నిస్తే.. తాను అత్యద్భుతమైన నానో టెక్నాలజీ(Nano Technology)ని ఉపయోగిస్తానని...
Novak Djokovic : వరల్డ్ నంబర్ 3 నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అదరగొడుతున్నాడు. అతను రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ పై గురిపెట్టాడు. అయితే.. అతడి ఛాతిపై చిప్(Chip) ఉండడం చర్చనీయాంశమైంది. రెండో రౌండ్లోమార్టన్ ఫక్సోవిక్స్పై విజయం తర్వాత జకోవిచ్ తన ఛాతి మధ్య భాగంలో చిన్నసైజ్ పరికరాన్ని టేపుతో అతికించుకోవడం కెమెరా కంట పడింది. ఇదే విషయమై అతడిని ప్రశ్నిస్తే.. తాను అత్యద్భుతమైన నానో టెక్నాలజీ(Nano Technology)ని ఉపయోగిస్తానని, అదొక పెద్ద రహస్యమని ఈ సెర్బియా స్టార్ చెప్పాడు. జకోవిచ్ చిప్ తగిలించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘నేను చిన్నప్పడు ఐరన్ మ్యాన్‌ను ఎక్కువగా ఇష్టపడేవాడిని. అతడిలా ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నించేవాడిని’ జోక్ చేశాడు. కానీ, ఆ తర్వాత ‘కోర్టులో నా ఆటను మెరుగుపరిచేందుకు నా బృందం నానో టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగిస్తుంది. ఇక చిప్ గురించి అంటారా..? నా కెరీర్లో అదొక పెద్ద రహస్యం. అదే గనకు సమర్థంగా పనిచేయకుంటే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుండే వాడినే కాదు’ అని జకోవిచ్ వెల్లడించాడు.
Iron Man has changed his Arc Reactor 😄#RolandGarros pic.twitter.com/XutxTAS1Y7
— Tennis Channel (@TennisChannel) May 31, 2023
చిప్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
ఈ చిప్‌ను ఇటలీకి చెందిన టావో టెక్నాలజీస్(Tao Technologies) అనే కంపెనీ తయారు చేసింది. మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొత్తరకం ఆవిష్కరణలు చేయడంలో ఈ కంపెనీకి అనుభవం ఉంది. ‘సూర్యకిరణాలు, శరీరం వేడి తగలగానే చిప్ యాక్టివ్ అవుతుంది. దీంతో, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి’ అని టావో టెక్నాలజీస్ ప్రతినిధి తెలిపాడు.
One of the best tennis players of all time, Novak Djokovic, last night showed at Roland Garros, during the match against Marton Fucsovics, a “patch” declaring that it’s “an incredibly effective nanotechnology” and the “biggest secret of his career”. Well, the nanotechnology in… pic.twitter.com/dNDmUOdut7
— Taopatch.com (@Taopatch) June 1, 2023
23వ గ్రాండ్‌స్లామ్ వేటలో
టెన్నిస్ ఆటలో సంచలనమైన జకోవిచ్ ఖాతాలో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. దాంతో, అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. స్పెయిన్ స్టార్ రఫెల్ నాద్లో కూడా 22 గ్రాండ్‌స్లామ్స్ సాధించాడు. దాంతో నాదల్ రికార్డు బద్ధలు కొట్టాలనుకుంటున్న జకోవిచ్ 23వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగడం అతడి టైటిల్ అవకాశాల్ని మరింత మెరుగుపరిచింది. అయితే.. వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ రూపంలో జకోవిచ్‌కు పెద్ద అడ్డంకి ఎదురుకానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

