దుబాయ్: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌లో కనకవర్షం కురిసిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది జరిగిన ప్రపంచకప్ ద్వారా దాదాపు 11,637 కోట్ల మేర ప్రయోజనం జరిగినట్లు నీల్సన్ జరిపిన సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డైస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ‘మెగాటోర్నీలో మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన నగరాల్లో టూరిజం ద్వారా 7వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా ట్రావెల్, ట్రాన్స్‌పోర్టెషన్, ఫుడ్, విదేశీ పర్యాటకులతో భారీ ఎత్తున డబ్బులు వచ్చాయి’ అని ఐసీసీ పేర్కొంది.
18 ఏండ్ల లోపువారికి ఫ్రీ టికెట్లు ; ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్
దుబాయ్: ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 మధ్య యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న మహిళల టీ20 ప్రపంచకప్‌ను విజయవంతం చేసేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏండ్ల లోపు ఉన్న వారికి వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకు అవకాశం కల్పించింది. అంతే గాక 18 ఏండ్ల వయసు పైబడ్డవారికి టికెట్ రేట్ల ప్రారంభ ధరను 5 ధిరమ్స్ (భారత కరెన్సీలో రూ. 115) గా నిర్ణయించినట్టు జెఫ్ అలార్డిస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.