న్యూజిలాండ్ మొదటి నుంచి కాస్త తడబడుతూ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లు కూడా న్యూజిలాండ్‌ను కట్టడి చేస్తున్నారు. దీంతో న్యూజిలాండ్ పరుగులు తీయడానికి తెగ కష్టపడుతోంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్.. ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు మాత్రమే చేసింది.
ఇప్పటికే మిచెల్ అవుట్ అయ్యాడు. అతడు 8 బంతుల్లో 11 కొట్టి పెవిలియన్ చేరగా.. బ్యాటింగ్ బరిలోకి దిగిన విలియమ్సన్ ముందు కాస్త తడబడినా.. తర్వాత రెచ్చిపోయాడు. వరుసగా.. రెండు ఫోర్లు కొట్టాడు. విలియమ్సన్.. 10 ఓవర్లు ముగిసే సమయానికి 19 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఓపెనర్ గప్టిల్.. 33 బంతుల్లో 27 పరుగులు చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్.. 3 ఓవర్లు వేసి 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
🔟 overs done.
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
🇳🇿 are 57/1.
How many more runs will they add to their total? #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/LXNh2vscyH