Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Newzealand : ప్రత్యేక సందర్భాలను అంతే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం క్రీడల్లోనూ చూస్తుంటాం. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్ సైతం వందేళ్ల బంధానికి ప్రతీకగా ప్రత్యేక జెర్సీని ఆవిష్కరించింది.
Newzealand : ప్రత్యేక సందర్భాలను అంతే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం క్రీడల్లోనూ చూస్తుంటాం. భారత్, జపాన్ 75 ఏళ్ల ద్వైపాక్షిక బంధానికి గుర్తుగా ఇటీవలే ఇరుదేశాల జట్లు ఏకైక టీ20 మ్యాచ్ ఆడాయి. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్ సైతం వందేళ్ల బంధానికి ప్రతీకగా ప్రత్యేక జెర్సీని ఆవిష్కరించింది. భారత జట్టుతో నూరు వసంతాలా క్రీడానుబంధాన్ని చాటేందుకు వన్డే సిరీస్ కోసం భారతీయ, తమ ప్రాంత మావోరొన్ తెగను ప్రతిబింబించేలా కొటహితంగ జెర్సీని విడుదల చేసింది న్యూజిలాండ్ క్రికెట్.
టీమిండియాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌కు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ ప్రత్యేక జెర్సీని విడుదల చేసింది. ఇరుదేశాల మధ్య క్రీడానుబంధం వందేళ్ల మైలురాయికి గుర్తుగా రెండు సంస్కృతులు మేళవించిన జెర్సీని ఆవిష్కరించింది. బెన్ థామ్సన్, శివ్ నారందాస్, జై పాంచ అనే ముగ్గురు ఆర్టిస్టులు శ్రమించి రూపొందించిన ఈ జెర్సీలో.. భారత జాతీయ పువ్వు కమలం, భారతీయ నిర్మాణాల్లో కనిపించే ఓగీ శైలి, మండల వంటివి ఉన్నాయి.
ఇక కివీస్‌లోని పురాతన మావోరి తెగను ప్రతిబింబించేలా నిలువు గీతలు జెర్సీపై ఉన్నాయి. టీమిండియాతో ఐదు వన్డేల సిరీస్‌లో బ్లాక్ క్యాప్స్ ఆటగాళ్లు ఈ స్పెషల్ జెర్సీతో బరిలోకి దిగనున్నారు. రెండు దేశాల ఐక్యతకు సూచికగా నిలిచే ఈ జెర్సీ రెబెల్ స్పోర్ట్స్ స్టోర్స్‌లో అందుబాటులో ఉందని న్యూజిలాండ్ క్రికెట్ పేర్కొంది.
Kotahitanga | Unity
Available now at https://t.co/QmhJAXWozn and selected Rebel Sport stores. https://t.co/FXgQnLO7iI
— BLACKCAPS (@BLACKCAPS) October 10, 2026
అక్టోబర్ మూడో వారంలో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని భారత బృందం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 22 నుంచి శ్రేయాస్ అయ్యర్ సేన, కివీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆపై నవంబర్ 4వ నుంచి ఇరుజట్లు ఐదు వన్డేల్లో తలపడతాయి. అనంతరం నవంబర్ 19 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టును టీమిండియా ఢీకొట్టనుంది.
The limited-edition Kotahitanga ODI shirt by Castore 🌿 🪷
Buy yours now at https://t.co/QmhJAXWozn or selected Rebel Sport stores. https://t.co/Low9ib2lf8
— BLACKCAPS (@BLACKCAPS) October 10, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

