ఐర్లాండ్‌పై 35 రన్స్ తేడాతో నెగ్గిన న్యూజిలాండ్
New Zealand win by 35 runs over Ireland in T20 world cup
అడిలైడ్: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 35 రన్స్ తేడాతో నెగ్గింది న్యూజిలాండ్. ఈ విక్టరీతో గ్రూప్ 1లో న్యూజిలాండ్ ఏడు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల ఆధారంగా గ్రూప్‌లో టాప్ ఎవరు నిలుస్తారో తెలుస్తుంది. న్యూజిలాండ్ దాదాపు సెమీస్‌కు చేరినట్లు కనిపిస్తున్నా.. ఆ రెండు మ్యాచ్‌లపై తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆసీస్, ఇంగ్లండ్ నెగ్గితే ఆ జట్లు కూడా ఏడు పాయింట్లతో సమం అవుతాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ పరిగణలోకి తీసుకుంటారు. కానీ న్యూజిలాండ్ దాదాపు తన సెమీస్ బర్త్ను ఖరారు చేసుకున్నట్లే కనిపిస్తోంది.
New Zealand register a comfortable victory against Ireland at the Adelaide Oval 👏#T20WorldCup | #IREvNZ | 📝 https://t.co/GxSSNsV9j5 pic.twitter.com/VgscLhbjYG
— ICC (@ICC) November 4, 2022
ఇవాళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 185 రన్స్ చేసింది. అయితే 186 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆరంభంలో అదరగొట్టింది. ఇద్దరు ఓపెనర్లు ఉత్తమ బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. తొలి వికెట్‌కు స్టిర్లింగ్, బాల్బిరైన్లు 61 రన్స్ జోడించారు. కానీ ఆ తర్వాత ఐర్లాండ్ బ్యాటర్లు కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. స్టిర్లింగ్ 37, బాల్బిరైన్ 30 రన్స్ చేసి ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు, సౌథీ-సాంటర్న్-సోధిలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 రన్స్ చేసింది.
ఉదయం ఐరిస్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ తీశాడు. 19వ ఓవర్లో విలియమ్సన్, నీషమ్, సాంట్నర్‌లను ఔట్ చేసి వరల్డ్‌కప్‌లో రెండవ హ్యాట్రిక్ నమోదు చేశాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ అత్యధికంగా 61 రన్స్ చేశాడు. మిగితా బ్యాటర్లలో అలెన్ 32, కాన్వే 28, మిచెల్ 31 రన్స్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

