T 20 | ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? ఏ టీమ్ ఎక్కువసార్లు గెలిచింది?
ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? | ఇంకొద్దిసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు ముద్దాడని రెండు జట్లు ఈ పోరులో పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి.
ఇంకొద్దిసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు ముద్దాడని రెండు జట్లు ఈ పోరులో పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి.

ఈరోజు మ్యాచ్ గురించి కాసేపు పక్కనపెడితే.. ఇప్పటి వరకు జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రికార్డులేంటో.. ఆయా మ్యాచ్‌లలో ఎన్నిసార్లు ఈ టీమ్స్ తలపడ్డాయి.. ఎక్కువసార్లు ఏ టీమ్ గెలిచిందో రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.
ఇప్పటి వరకు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 14 సార్లు తలపడ్డాయి. అందులో ఆస్ట్రేలియా 9 సార్లు గెలిచింది. న్యూజిలాండ్ మాత్రం కేవలం 4 సార్లు మాత్రమే గెలిచింది. ఒక సారి మ్యాచ్ డ్రా అయింది.
ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను చూసుకుంటే.. ఆస్ట్రేలియా అయితే దూసుకుపోతోంది. అన్ని సిరీస్‌లలో సత్తా చాటుతోంది. న్యూజిలాండ్ కూడా ఇటీవల వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ను ఓడించి మొదటి టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదే ఊపుతో టీ20 వరల్డ్ కప్‌ను కూడా గెలిచి తమ సత్తా చాటాలని తాపత్రయపడుతోంది.
2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ మ్యాచ్ ధర్మశాలలో జరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

