లండన్: తొలి రోజు బౌలర్ల హవా సాగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టులో రెండో రోజు బ్యాటర్లు రాణించారు. మిడిలార్డర్ ప్లేయర్లు డారిల్ మిషెల్ (97 బ్యాటింగ్; 11 ఫోర్లు), టామ్ బ్లండెల్ (90 బ్యాటింగ్; 12 ఫోర్లు) దంచి కొట్టడంతో కివీస్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. లాథమ్ (14), యాంగ్ (1), కెప్టెన్ విలియమ్సన్ (15), కాన్వే (13) విఫలమయ్యారు. చేతిలో 6 వికెట్లు ఉన్న న్యూజిలాండ్.. ప్రస్తుతం 227 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 116/7తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. 141 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ (43) టాప్ స్కోరర్ కాగా.. కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టారు. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 132 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.