Naveen-ul-Haq : ఐపీఎల్లో ‘స్వీట్ మ్యాంగోస్’ పోస్ట్‌తో వైరలైన అఫ్గనిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్(Naveen-ul-Haq) అంతర్జాతీయ పునరాగమనానికి వేళైంది. ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆసియా కప్ టోర్నీకి దూరమైన ఈ స్పీడ్‌స్టర్ భారత పర్యటనకు ఎంపికయ్యాడు. త్వరలో జరుగనున్న మూడు టీ20ల సిరీస్కోసం అతడు ఇండియా వస్తున్నాడు. రెండేళ్లుగా జట్టుకు దూరమైన అతడు తనకు అచ్చొచ్చిన నేలపై చెలరేగిపోవాలని భావిస్తున్నాడు.
అఫ్గనిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయనున్నాడు. దాదాపు రెండేళ్ల క్రితం చివరి టీ20 సిరీస్ ఆడిన నవీన్.. భారత పర్యటనకు ఎంపికయ్యాడు. త్వరలో జరుగనున్న మూడు టీ20ల సిరీస్‌తో అతడు మళ్లీ అఫ్గన్ జెర్సీతో కనిపించనున్నాడు. గాయం నుంచి కోలుకొని.. దేశవాళీ క్రికెట్లో రాణించిన ఈ ఎడమచేతివాటం పేసర్ రాకతో కాబూలీ బౌలింగ్ దళం పటిష్టంగా మారింది. అలానే అనుభవజ్ఞుడైన గుల్బదిన్ నబీ ఎంపికతో మిడిలార్డర్లో బ్యాటింగ్ కష్టాలు తొలగినట్టే. 2023 వన్డే ప్రపంచకప్ అనంతరం నవీన్ 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
AFGHANISTAN SQUAD ANNOUNCEMENT 🚨
Naveen-ul-Haq is back in the Afghanistan squad for the T20I series against India. His last game for Afghanistan was in December 2024.
The India series will also be first assignment for Ibrahim Zadran as Afghanistan T20I captain.#AFGvIND pic.twitter.com/lfzUqGXSsm
— Cricbuzz (@cricbuzz) August 24, 2026
ఇక కెప్టెన్‌గా ఇబ్రహీం జద్రాన్‌కు ఇదే మొదటి సిరీస్. అలానే అన్క్యాప్డ్ బ్యాటరైన నూర్ రహమాన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఎప్పటిలానే స్పిన్ విభాగంలో.. నలుగురికి చోటు దక్కింది. మాజీ సారథి రషీద్ ఖాన్, నబీ, నూర్ అహ్మద్, ఖరోటిలు భారత బ్యాటర్లను ఇరుకున పెట్టే అవకాశముంది. సెప్టెంబర్ 13, 15, 17వ తేదీల్లో టీ20 మ్యాచుల్లో భారత్, అఫ్గనిస్థాన్ తలపడనున్నాయి.
అఫ్గనిస్థాన్ స్క్వాడ్ : ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(కెప్టెన్), నూర్ రహమాన్(వికెట్ కీపర్), సెడీకుల్లా అటల్, డార్విష్ రసూలి. అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నబీ, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నాన్గ్యాల్ ఖరోటి, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, నవీన్ ఉల్ హక్.