ఓరుగల్లులో జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్.. 5000 మీ. పరుగు విజేతలు వీళ్లే..
Warangal | వరంగల్ నగరంలో 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలుత 5000 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పురుషుల

వరంగల్ : వరంగల్ నగరంలో 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలుత 5000 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పురుషుల 5000 మీ. పరుగు పందెంలో ఉత్తరప్రదేశ్కు చెందిన అభిషేక్ పాండే మొదటి స్థానంలో నిలవగా, మహిళల 5000 మీ. పరుగు పందెంలో యూపీకి చెందిన పారౌల్ చౌదరి మొదటి స్థానంలో నిలిచింది.

ఈ పోటీలు 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వరంగల్ వేదికగా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగడం ఇది రెండో సారి కావడం విశేషం. గతం (2020)లో క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ పోటీలకు వరంగల్ ఆతిథ్యమిచ్చింది. ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ విషయానికొస్తే 47 క్రీడా ఈవెంట్లలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 519 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్), నిట్ స్టేడియంలో కొనసాగుతున్నాయి.

తెలంగాణ నుంచి 17 మంది
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ నుంచి 17 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. వీరిలో యువ అథ్లెట్లు అగసర నందిని, జివాంజీ దీప్తి, హారికా దేవి ఉన్నారు. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో సత్తాచాటాలన్న పట్టుదలతో వీరంతా కనిపిస్తున్నారు. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణలో రాటుదేలుతున్న వీరంతా..జాతీయ టోర్నీలో రాణించడం ద్వారా మరోమారు తమ ప్రతిభను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

