హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఐఎస్సీఈ ఏపీ- తెలంగాణ ప్రి సుబ్రతో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన నాసర్ బాయ్స్ స్కూల్ జట్టు చాంపియన్గా నిలిచింది. గచ్చిబౌలిలో జరిగిన అండర్-15విభాగంఫైనల్ పోరులో నాసర్ టీమ్ 10 గోల్ తేడాతో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ పై విజయం సాధించింది. మహమ్మద్ తుర్హాన్ అద్భుతమైన గోల్ సాధించి జట్టును విజేతగా నిలిపాడు.